BREAKING
భూముల రీ సర్వేతో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా చైనా రాజకీయాల్లో మళ్లీ కలకలం విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి.. సర్పంచ్ ఇంటి ఎదుట ఆందోళన 34వ డివిజన్‌లో పర్యావరణ పరిరక్షణకు మొక్కల పంపిణీ జనసేన పార్టీ రాజాo నియోజకవర్గం సమన్వయకర్త కి చిరు సన్మానం పక్క ప్రణాళికతోనే లక్ష్యాన్ని సాధించవచ్చు - కలెక్టర్ రాజర్షిషా గజలాపురం మల్టీ పర్పస్ వర్కర్ వేధింపుల ఉదంతం పై విచారణ ఘనంగా కి. శే. శ్రీ గోర్రిపాటి బుచ్చి అప్పారావు 114 వ జయంతి ఉత్సవాలు అణు విద్యుత్ రంగంలో స్లొవేకియా మరో మైలురాయి చెరకు రైతుల రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం చేయండి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ఇంద్రకీలాద్రిపై ఘన స్వాగతం రైతులకు, మహిళలకు కూటమి ప్రభుత్వమే కొండంత అండ : ఎమ్మెల్యే కోళ్ల అక్టోబర్ 17 వరకు రియాద్, జెడ్డా, దమ్మామ్‌లకు విమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ ఇండియా! 'యూఎస్ గ్రీన్ కార్డ్‌ను వదులుకున్నా':అనుపమ్ మిట్టల్

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ భేటీ

Select Suryaa Now
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ భేటీ

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: ఢిల్లీలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు టి. రామ్మోహన్ రెడ్డి, బుయ్యని మనోహర్ రెడ్డితో కలిసి జాదవ్ ధారాసింగ్ నాయక్ ఈ సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకులకు సూచించారు. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అర్హులైన పట్టభద్రులందరి పేర్లు ఓటరు జాబితాలో నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియకు ప్రాధాన్యతనిస్తూ, అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని సీఎం సూచించారు. ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ, ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.