BREAKING
భూముల రీ సర్వేతో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా చైనా రాజకీయాల్లో మళ్లీ కలకలం విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి.. సర్పంచ్ ఇంటి ఎదుట ఆందోళన 34వ డివిజన్‌లో పర్యావరణ పరిరక్షణకు మొక్కల పంపిణీ జనసేన పార్టీ రాజాo నియోజకవర్గం సమన్వయకర్త కి చిరు సన్మానం పక్క ప్రణాళికతోనే లక్ష్యాన్ని సాధించవచ్చు - కలెక్టర్ రాజర్షిషా గజలాపురం మల్టీ పర్పస్ వర్కర్ వేధింపుల ఉదంతం పై విచారణ ఘనంగా కి. శే. శ్రీ గోర్రిపాటి బుచ్చి అప్పారావు 114 వ జయంతి ఉత్సవాలు అణు విద్యుత్ రంగంలో స్లొవేకియా మరో మైలురాయి చెరకు రైతుల రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం చేయండి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ఇంద్రకీలాద్రిపై ఘన స్వాగతం రైతులకు, మహిళలకు కూటమి ప్రభుత్వమే కొండంత అండ : ఎమ్మెల్యే కోళ్ల అక్టోబర్ 17 వరకు రియాద్, జెడ్డా, దమ్మామ్‌లకు విమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ ఇండియా! 'యూఎస్ గ్రీన్ కార్డ్‌ను వదులుకున్నా':అనుపమ్ మిట్టల్

శాస్త్రీయ దృక్పథంతోనే సమాజాభివృద్ధి మూఢనమ్మకాలను వీడి శాస్త్రీయ ఆలోచనలు అలవర్చుకోవాలి: ఏ. రవి

Select Suryaa Now
శాస్త్రీయ దృక్పథంతోనే సమాజాభివృద్ధి  మూఢనమ్మకాలను వీడి శాస్త్రీయ ఆలోచనలు అలవర్చుకోవాలి: ఏ. రవి

భీమవరం, సూర్య న్యూస్: సమాజాభివృద్ధికి శాస్త్రీయ దృక్పథం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ మూఢనమ్మకాలను వీడి శాస్త్రీయ ఆలోచనలను అలవర్చుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఏ. రవి పిలుపునిచ్చారు. భీమవరంలోని భవన నిర్మాణ కార్మికుల భవనంలో మంగళవారం అంగన్‌వాడీ కార్యకర్తల జిల్లా విద్యా వైజ్ఞానిక తరగతులు ప్రారంభమయ్యాయి.శాస్త్రీయ ఆలోచన’ అంశంపై ఏ. రవి మాట్లాడుతూ.. ప్రజల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని ఆసరాగా చేసుకుని కొందరు స్వార్థపరులు మూఢనమ్మకాలను పెంచి రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. శాస్త్రీయ దృక్పథం మనుషుల్లో బాధ్యత, కష్టపడే తత్వాన్ని పెంపొందించి సన్మార్గంలో నడిపిస్తుందని పేర్కొన్నారు.అనంతరం ‘నయా ఉదారవాద విధానాలు–కార్మికులపై ప్రభావం’ అనే అంశంపై సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. రాజా రామ్మోహన్ రాయ్ మాట్లాడుతూ.. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలతో కార్మికుల ఉద్యోగ భద్రత, సంక్షేమం దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు, ప్రాథమిక సౌకర్యాలు కల్పించడంలో కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్మిక హక్కుల పరిరక్షణకు శ్రామిక వర్గమంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ తరగతులకు అంగన్‌వాడీ జిల్లా నాయకురాలు ఎండీ. హసీనా ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కే. వాసుదేవరావు, అంగన్‌వాడీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కే. ఝాన్సీ లక్ష్మి, డి. కళ్యాణి, కే. తులసితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 రిపోర్టర్ శ్రీనివాస్ భీమవరం పశ్చిమగోదావరి జిల్లా