BREAKING
పెళ్లి వేడుక సందడితో తఖబ్బలల్లా పాట.. 40 డేస్ ఆఫ్ హౌస్ పార్టీ నుంచి రెండో గీతం విడుదల గోవాలో అట్టహాసంగా ముగిసిన 57వ ఇఫీ వేడుకలు.. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి, అవార్డుల విజేతలు వీరే వృషకర్మలో ఊహించని ట్విస్ట్.. మీనాక్షి చౌదరి పాత్రపై దర్శకుడు కార్తీక్ దండు ఆసక్తికర హింట్ యే ప్రేమ్ మోల్ లియాలో అనుపమ్ ఖేర్ నటనకు కన్నీళ్లు పెట్టుకున్న మహేశ్ భట్.. భావోద్వేగ లేఖ ఏడవకపోతే రూ. కోటి.. ఏడిస్తే రూ. లక్ష.. అల్లు అరవింద్‌తో ఖరీదైన బెట్ ఓడిపోయిన సుకుమార్ వృషకర్మ వర్సెస్ అలియాస్ రుక్మిణి.. డిసెంబర్ 4 బాక్సాఫీస్ పోరులో గెలిచేదెవరు వేములవాడలో ఆధునిక పోస్టాఫీస్ భవన నిర్మాణానికి కృషి చేస్తా - బండి సంజయ్ కుమార్ హామీ దొడగట్ట సర్పంచ్ రామాంజినేయులు కు ఘనంగా సన్మానం.. అలియాస్ రుక్మిణిపై నాని సంచలన వ్యాఖ్యలు.. అలా అనిపించకపోతే సినిమాలు మానేస్తా పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత

గాయత్రి దేవి అలంకరణలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు

Select Suryaa Now
గాయత్రి దేవి అలంకరణలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు

భీమవరం, సూర్య న్యూస్: భీమవరం పట్టణ ప్రజల ఇలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గాయత్రి దేవి అలంకరణలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో, ఈవో, సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.వేదమాతగా, జ్ఞానప్రదాయినిగా పూజలందుకునే గాయత్రి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నారు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే దివ్యశక్తిగా గాయత్రి దేవిని భక్తులు ఆరాధించారు.అమ్మవారిని దర్శించుకున్న భక్తులు కుటుంబ సుఖసంతోషాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని ప్రార్థించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో భక్తి వాతావరణం నెలకొంది. అమ్మవారి దివ్యదర్శనం కోసం భక్తులు తరలివచ్చారు.

 రిపోర్టర్ శ్రీనివాస్ భీమవరం పశ్చిమగోదావరి జిల్లా