BREAKING
సెప్టెంబర్‌లో 6.14 శాతం పెరిగిన భారతీయ రైల్వేల సరుకు రవాణా జిల్లాలో ఉపాధి పనులు వెంటనే ప్రారంభించాలి- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గాయత్రి దేవి అలంకరణలో శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు శాస్త్రీయ దృక్పథంతోనే సమాజాభివృద్ధి మూఢనమ్మకాలను వీడి శాస్త్రీయ ఆలోచనలు అలవర్చుకోవాలి: ఏ. రవి ఇన్విట్ ప్రైవేటైజేషన్ కోసం రంగంలోకి దిగిన దిగ్గజ ఇన్వెస్టర్లు బ్యాంక్ ఆఫ్ బరోడాపై రూ. 1.44 లక్షల కోట్ల మెగా దావా: కోర్టును ఆశ్రయించిన బీఆర్ శెట్టి! ఏఐ డీప్‌ఫేక్స్ పై సీరియస్ అయిన హీరోయిన్ శ్రియా శరణ్.. మహిళలపై డిజిటల్ వేధింపులు సరికాదంటూ ఘాటు వ్యాఖ్యలు! ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ భేటీ ఆటో రంగానికి ముప్పు మున్ముందు దుర్గామాత స్వాములకు భిక్ష ఏర్పాటు పేద కుటుంబాలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకు గాయం.. మెడికల్ వాకింగ్ బూట్‌తో ఫొటో షేర్ చేసిన నటుడు! ఆసియా ఇన్వెస్టర్ల చూపు హెడ్జ్ ఫండ్లపై రూ 1.40 కోట్లతో నిర్మించిన ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ అమలు: స్పష్టం చేసిన ఎన్‌పీసీఐ!

సంతానానికి భారం కావద్దని తండ్రి ఆత్మహత్య...

Select Suryaa Now
సంతానానికి భారం కావద్దని తండ్రి ఆత్మహత్య...

మేజర్ న్యూస్, షాద్ నగర్ :కొడుకులకు తాను భారం కాకూడదనే మనస్తాపంతో ఓ వృద్ధ తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన షాద్ నగర్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ డి. మల్లేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండలం నిడదవెళ్లి గ్రామానికి చెందిన కమ్మరి పాండయ్య (59) గత 25 ఏళ్లుగా నందిగామ గ్రామంలో వడ్రంగి పని చేస్తూ జీవిస్తున్నాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండేళ్ల క్రితం భార్య చనిపోవడంతో పాండయ్య ఒంటరివాడయ్యాడు. దీనికి తోడు గత కొంతకాలంగా తీవ్రమైన కాలు నొప్పితో బాధపడుతుండటంతో ఆయన తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా తన వల్ల కొడుకులు ఇబ్బంది పడకూడదనే బాధతో పాండయ్య ఈరోజు సోమవారం తెల్లవారుజామున 3:00 గంటల ప్రాంతంలో నందిగామ రైల్వే బ్రిడ్జి వద్దకు వెళ్లి, వేగంగా వస్తున్న రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉదయం రైల్వే ట్రాక్‌పై మృతదేహాన్ని గమనించిన స్టేషన్ మాస్టర్ వెంకట్రావు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఆయన ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ డి. మల్లేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 25 ఏళ్లుగా గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండే పాండయ్య ఆత్మహత్య చేసుకోవడంతో  గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి..

రాఘవేందర్ గౌడ్: మేజర్ న్యూస్, షాద్ నగర్