BREAKING
భూముల రీ సర్వేతో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా చైనా రాజకీయాల్లో మళ్లీ కలకలం విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి.. సర్పంచ్ ఇంటి ఎదుట ఆందోళన 34వ డివిజన్‌లో పర్యావరణ పరిరక్షణకు మొక్కల పంపిణీ జనసేన పార్టీ రాజాo నియోజకవర్గం సమన్వయకర్త కి చిరు సన్మానం పక్క ప్రణాళికతోనే లక్ష్యాన్ని సాధించవచ్చు - కలెక్టర్ రాజర్షిషా గజలాపురం మల్టీ పర్పస్ వర్కర్ వేధింపుల ఉదంతం పై విచారణ ఘనంగా కి. శే. శ్రీ గోర్రిపాటి బుచ్చి అప్పారావు 114 వ జయంతి ఉత్సవాలు అణు విద్యుత్ రంగంలో స్లొవేకియా మరో మైలురాయి చెరకు రైతుల రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం చేయండి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ఇంద్రకీలాద్రిపై ఘన స్వాగతం రైతులకు, మహిళలకు కూటమి ప్రభుత్వమే కొండంత అండ : ఎమ్మెల్యే కోళ్ల అక్టోబర్ 17 వరకు రియాద్, జెడ్డా, దమ్మామ్‌లకు విమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ ఇండియా! 'యూఎస్ గ్రీన్ కార్డ్‌ను వదులుకున్నా':అనుపమ్ మిట్టల్

నాగిరెడ్డిపేటలో మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన.

Select Suryaa Now
నాగిరెడ్డిపేటలో మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన.

సూర్య, నాగిరెడ్డి పేట్ : సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలని పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్స్ రామంచ తిరుపతి,శేషరావు,లు  ప్రజలకు సూచించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్ గౌడ్ చూచన మేరకు స్థానిక హెడ్ కానిస్టేబుల్ మదన్ ఆధ్వర్యంలో మంగళవారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్లో మరియు బస్టాండ్ వద్ద పోలీస్ కళాబృందంచే సైబర్ నేరాలపై, మాదక ద్రవ్యాల నివార‌ణ‌పై , రోడ్డు ప్రమాదాలపై , మహిళల, బాలికల రక్షణే షీ టీం, లపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కళాబృందం సభ్యులు మాటలు, పాటల ద్వారా ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సైబర్‌ నేరాలు బాగా పెరిగాయని, ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. సైబర్‌ మోసగాళ్ల ఉచ్చులో పడొద్దని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దన్నారు. ఆశ చూపిస్తే వాటికి ఆకర్షితులు కావొద్దన్నారు. సైబర్‌ మోసాలకు గురైతే వెంటనే టోల్‌ఫ్రీ నెంబర్‌ 1930 కి కాల్‌ చేయాలన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని, మైనర్లు వాహనాలు నడపవద్దని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మహిళలు, బాలికలు ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా పోలీసులను, షీ టీంను సంప్రదించాలని సూచించారు. మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే షీ టీం 8712686094 నంబర్ను సంప్రదించాలని, ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుళ్లు రామంచ తిరుపతి, యు. శేషారావు, కానిస్టేబుళ్లు సాయిలు, ప్రభాకర్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ పవన్,బ్యాంక్ సిబ్బంది,నాగిరెడ్డిపేట హెడ్ కానిస్టేబుల్ M.మదన్, బ్లూ కోట్స్ PC.ధక్షణపూర్తి, HG.సాయి కుమార్, ఎల్లారెడ్డి షి టీమ్ PC.శ్రీశైలం,తదితరులు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బ్యాంక్ కస్టమర్స్, ప్రయాణికులు కార్యక్రమాన్ని వీక్షించారు.