BREAKING
భూముల రీ సర్వేతో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా చైనా రాజకీయాల్లో మళ్లీ కలకలం విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి.. సర్పంచ్ ఇంటి ఎదుట ఆందోళన 34వ డివిజన్‌లో పర్యావరణ పరిరక్షణకు మొక్కల పంపిణీ జనసేన పార్టీ రాజాo నియోజకవర్గం సమన్వయకర్త కి చిరు సన్మానం పక్క ప్రణాళికతోనే లక్ష్యాన్ని సాధించవచ్చు - కలెక్టర్ రాజర్షిషా గజలాపురం మల్టీ పర్పస్ వర్కర్ వేధింపుల ఉదంతం పై విచారణ ఘనంగా కి. శే. శ్రీ గోర్రిపాటి బుచ్చి అప్పారావు 114 వ జయంతి ఉత్సవాలు అణు విద్యుత్ రంగంలో స్లొవేకియా మరో మైలురాయి చెరకు రైతుల రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం చేయండి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ఇంద్రకీలాద్రిపై ఘన స్వాగతం రైతులకు, మహిళలకు కూటమి ప్రభుత్వమే కొండంత అండ : ఎమ్మెల్యే కోళ్ల అక్టోబర్ 17 వరకు రియాద్, జెడ్డా, దమ్మామ్‌లకు విమాన సర్వీసులు రద్దు చేసిన ఎయిర్ ఇండియా! 'యూఎస్ గ్రీన్ కార్డ్‌ను వదులుకున్నా':అనుపమ్ మిట్టల్

నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి బౌద్ధ వారసత్వ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

Select Suryaa Now
నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి బౌద్ధ వారసత్వ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి.. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

---నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి బౌద్ధ వారసత్వ, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి... జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్

--పర్యాటక మౌళిక సదుపాయాల అభివృద్ధి, పురావస్తు కట్టడాల పరిరక్షణ, పునరుద్ధరణ పనులకు రూ. 4.26 కోట్లు మంజూరు

కంబోడియా, థాయ్‌లాండ్, భారత దేశాలకు చెందిన బౌద్ధ భిక్షువులతో అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధ క్షేత్ర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌పై చర్చలు

ఖమ్మం సూర్య బ్యూరో/ నేలకొండపల్లి, అక్టోబర్ -13

జిల్లాలోని నేలకొండపల్లిలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాచీన బౌద్ధ క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయి బౌద్ధ వారసత్వ, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. మంగళవారం నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రంలో పర్యాటక మౌళిక సదుపాయాల అభివృద్ధి, పురావస్తు కట్టడాల పరిరక్షణ, పునరుద్ధరణపై బౌద్ధ బిక్షువుల సలహాలు, సూచనలు స్వీకరించారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, 
నేలకొండపల్లి తెలంగాణలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాచీన బౌద్ధ పురావస్తు క్షేత్రాలలో ఒకటని తెలిపారు. నేలకొండపల్లి లో గతంలో నిర్వహించిన పురావస్తు తవ్వకాల ద్వారా మహాస్తూపం, బౌద్ధ విహారాలు, సమావేశ మందిరాలు, ఇతర బౌద్ధ నిర్మాణాల అవశేషాలు వెలుగులోకి వచ్చాయన్నారు.
పురావస్తు ఆధారాలు ప్రాచీన కాలంలో నేలకొండపల్లి ప్రముఖ బౌద్ధ ధార్మిక, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లిందని తెలియజేస్తున్నాయని, ఈ చారిత్రక సంపదను శాస్త్రీయ పద్ధతిలో పరిరక్షిస్తూ భావితరాలకు అందించడంతోపాటు, దేశవిదేశాల బౌద్ధ యాత్రికులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యమని అన్నారు.
కేవలం ఒక భవన నిర్మాణంలా కాకుండా, బౌద్ధ ధర్మానికి గౌరవ సూచకంగా, దానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.  అభివృద్ధి పనుల ప్రణాళిక రూపకల్పన కోసం పురావస్తు శాఖ సంచాలకులతో పాటు బౌద్ధ ధర్మ నిపుణులు శివనాగిరెడ్డి, రిటైర్డ్ ఐపీఎస్ ఉపేంద్ర రెడ్డి, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ లక్ష్మయ్య తదితరులతో కూడిన ఒక నిపుణుల కమిటీ (కోర్ టీమ్)ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బౌద్ధ భిక్షువులు, నిపుణుల సలహాలు, సూచనలను స్వీకరించి వచ్చే ఒకటిన్నర సంవత్సరంలో నేలకొండపల్లిని అత్యున్నత బౌద్ధ క్షేత్రంగా మారుస్తామని తెలిపారు. జీవనంలో మోహాలు, మాయలు వీడి, గౌతమ బుద్ధుడు చూపిన మధ్యే మార్గం ద్వారానే మానవజాతి శాంతియుతంగా జీవించగలదని, అటువంటి మహోన్నత జ్ఞానాన్ని అందించిన బౌద్ధ ధర్మ ప్రచారానికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. భారతదేశంలోని ప్రముఖ బౌద్ధ క్షేత్రాల సరసన నేలకొండపల్లిని టాప్-3 లో నిలపడమే లక్ష్యమని అన్నారు.కార్యక్రమంలో హెరిటేజ్ తెలంగాణ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి మాట్లాడుతూ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ  ఆధ్వర్యంలో రూ. 2.50 కోట్ల వ్యయంతో నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రంలో పర్యాటకులకు అవసరమైన మౌళిక సదుపాయాల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. అభివృద్ధిలో భాగంగా పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు, సందర్శకుల మార్గాలు, ప్రాంగణ సుందరీకరణ, సమాచార సూచికలు, ఇతర మౌళిక సదుపాయాలను కల్పించడానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారన్నారు.  రూ. 1.76 కోట్ల వ్యయంతో ప్రాచీన బౌద్ధ విహారాలు, సమావేశ మందిరం, సంబంధిత పురావస్తు నిర్మాణాల పరిరక్షణ, పునరుద్ధరణ పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పనులకు అవసరమైన నిధులను వైటీపీఎస్, తెలంగాణ జెన్ కో ద్వారా సమకూర్చుకున్నట్లు అన్నారు. పురావస్తు కట్టడాల అసలు నిర్మాణ స్వరూపం, చారిత్రక ప్రాధాన్యత, నిర్మాణ శైలి దెబ్బతినకుండా శాస్త్రీయ పరిరక్షణ పద్ధతుల్లో పనులను చేపట్టనున్నట్లు హెరిటేజ్ తెలంగాణ శాఖ డైరెక్టర్ తెలిపారు.కంబోడియా, థాయ్‌లాండ్, భారత దేశానికి చెందిన బౌద్ధ భిక్షువులు  నేలకొండపల్లి ప్రాచీన బౌద్ధ క్షేత్రం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతపై ఆసక్తి వ్యక్తం చేశారు. నేలకొండపల్లి మహాస్తూపం, బౌద్ధ విహారాలు, ఇతర ప్రాచీన నిర్మాణాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి, ప్రపంచ బౌద్ధ యాత్రికులను ఆకర్షించే ప్రముఖ బౌద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సూచించారు.నేలకొండపల్లి బౌద్ధ క్షేత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడానికి సమగ్ర మాస్టర్ ప్లాన్  రూపొందించే అంశంపై కార్యక్రమంలో ప్రత్యేక చర్చలు జరిగాయి. ఇట్టి చర్చల్లో హెరిటేజ్ తెలంగాణ శాఖ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు, పురావస్తు, పర్యాటక రంగ నిపుణులు, కన్సల్టెంట్లతోపాటు ఆంజనేయ రెడ్డి, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్  సలహాలు, సూచనలతో మాస్టర్ ప్లాన్ రూపొందించే అంశంపై చర్చించారు. ఈ ప్రణాళికలో మహాస్తూపం పరిరక్షణ, బౌద్ధ విహారాల పునరుద్ధరణ, పర్యాటక మౌళిక సదుపాయాల అభివృద్ధి, సందర్శకుల నిర్వహణ, ప్రాంగణ సుందరీకరణ, బౌద్ధ చరిత్రను వివరించే సమాచార వ్యవస్థ వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చర్చించారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీఐ కమీషనర్ పివి. శ్రీనివాస రావు, హెరిటేజ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్లు డా. పి. నాగరాజు,  ఎన్. నరసింగ్, సూపరింటెండెంట్ ఎ. రాజు,  జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి, జిల్లా ఇంటర్మీడియేట్ అధికారి రవి బాబు, నేలకొండపల్లి మండల తహసీల్దార్ రాంప్రసాద్, సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, హైదరాబాద్‌ ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డా. ఇ. శివనాగిరెడ్డి,  వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, అంతర్జాతీయ బౌద్ధ భిక్షువులు, పురావస్తు పరిశోధకులు, పర్యాటక రంగ ప్రతినిధులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.