BREAKING
మచిలీపట్నం పోర్టుకు అనుబంధంగా కాన్‌కార్ లాజిస్టిక్స్‌ హబ్‌ ఏర్పాటుకు ఎంపీ బాలశౌరి కృషి బీసీలకు 34 శాతం రాజకీయ ప్రాతినిధ్యం హర్షణీయం చంద్రబాబు ప్రకటనపై టీడీపీ నాయకుడు కాయల రమణ యాదవ్ హర్షం స్క్రాబుల్ టోర్నమెంట్‌లో పెనుగొండ భాష్యం విద్యార్థికి ద్వితీయ స్థానం చల్లపల్లిలో ఈనెల 15న జాబ్ మేళా ఏల్చూరులో రూ.35.78 కోట్లతో 132/33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన. గపూర్ నగర్ లో మిగులు భూమిపై విచారణ జరిపించాలి దసరా సెలవుల జోష్.. ట్యాంక్ బండ్‌కు పోటెత్తిన పర్యాటకులు! కండ్రికలో పలగాని బాబురావు పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోనసీమ దసరా వైభవం: అమలాపురంలో అంబరాన్నంటే ఉత్సవాలు. గాయత్రీ దేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో వినతుల స్వీకరణ. ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ఛార్జీలపై తెలంగాణ ప్రభుత్వం పునఃసమీక్ష భక్తులకు సౌకర్యవంతమైన దర్శనమే లక్ష్యం సమాచార హక్కు చట్టం దరఖాస్తులకు గడువులోగా సమాధానాలివ్వాలి ప్రభుత్వ శాఖల అధికారులకు డీఆర్ఓ ఏ. మలోల ఆదేశం సింగరకొండలో వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం.

అభివృద్ధి మా ధ్యేయం… ప్రజా సంక్షేమం మా లక్ష్యం!

Select Suryaa Now
అభివృద్ధి మా ధ్యేయం… ప్రజా సంక్షేమం మా లక్ష్యం!

నెల్లూరు సిటీ,మేజర్ న్యూస్ :   నెల్లూరు నగరంలోని ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం… పరిష్కారం దిశగా అడుగులు వేస్తాం! కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చొరవతో గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, ప్రతి గ్రామానికి మంచినీటి సదుపాయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పన దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి ప్రజలకు కనిపిస్తోంది… ప్రజా సంక్షేమం ముందుకు సాగుతోంది  నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి!

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో  21వ (పాత 16వ) డివిజన్‌లోని రాంజీ నగర్‌లో  గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న జనసేన–కూటమి ప్రచారం ఈరోజు కూడా యథావిధిగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ కూటమి అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. నెల్లూరు నగర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే  డాక్టర్ పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో  నగర సుందరీకరణతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత లభిస్తోంది. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తూ నెల్లూరు నగరాన్ని మరింత సుందరంగా, ఆధునికంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లడంతో పాటు, మున్సిపల్ శాఖ మంత్రిగా రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి, ఆధునికీకరణకు శ్రీ పొంగూరు నారాయణ గారు చేస్తున్న కృషి ప్రశంసనీయం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట్రాభివృద్ధికి మరింత తోడ్పాటునందిస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం–జనసేన–బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించి, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టాలని జనసేన నాయకుడు  కిషోర్ గునుకుల  విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, యువత, విద్యావంతులు సహా పలువురు ప్రజలను కలుసుకోగా, కూటమి అభివృద్ధి కార్యక్రమాలపై సానుకూల స్పందన లభించిందని నాయకులు తెలిపారు. నగర అభివృద్ధి కొనసాగేందుకు కూటమికి మద్దతు తెలుపుతామని పలువురు పేర్కొన్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు  కిషోర్ గునుకుల,  జనసేన వీరమహిళ  విజయలక్ష్మి గునుకుల,  ప్రవల్లిక, సుప్రియ, కల్పన, కృష్ణవేణి, మడపర్తి ప్రశాంత్ గౌడ్, మల్లిరెడ్డి, నరహరి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.