సీఈసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్
సూర్య రాజన్న సిరిసిల్ల భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ఎస్ఐఆర్ పై నిరసనగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని చేపట్టారు. సోమవారం రోజున ఎస్ ఐఆర్ పై నిరసన తెలుపుతూ సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా గాంధీ చౌక్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు.అంబేద్కర్ విగ్రహానికి ఎస్ఐఆర్ పై వినతిపత్రం అందజేశారు.అనంతరం సిరిసిల్ల పట్టణంలోని విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.