మహేశ్వరం గ్రామ మంచినీటి ట్యాంకుల స్థలంపై సమగ్ర విచారణ జరపాలి
మహేశ్వరం గ్రామ మంచినీటి ట్యాంకుల స్థలంపై సమగ్ర విచారణ జరపాలి:వనంపల్లి శ్రవణ్
మహేశ్వరం గ్రామంలోని కల్లు కాంపౌండ్ వెనుక భాగంలో గ్రామ ప్రజలకు మంచినీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంకుల స్థలానికి సంబంధించిన సమస్యపై బీజేపీ మహేశ్వరం మండల ప్రధాన కార్యదర్శి వనంపల్లి శ్రవణ్ సంబంధిత అధికారులకు సోమవారం ప ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా శ్రావణ్ మాట్లాడుతూ..గత సుమారు 50 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మంచినీటి ట్యాంకులు కొనసాగుతూ గ్రామ ప్రజలకు నీటి సరఫరా చేస్తున్నారని, ఈ స్థలానికి సంబంధించిన సర్వే నంబరు, యాజమాన్య వివరాలు, పాత, ప్రస్తుత రెవెన్యూ రికార్డులను సమగ్రంగా పరిశీలించి, అధికారిక సర్వే ద్వారా స్థల హద్దులను నిర్ధారించాలని అధికారులను కోరారు.గతంలో ఈ సమస్యను గ్రామసభలో కూడా అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పటికీ, ఇప్పటివరకు పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదని తెలిపారు. ఈ స్థలం తమదని కొందరు వ్యక్తులు పత్రాలు చూపిస్తున్నట్లు, అక్కడ ఉన్న ప్రహరీ గోడ తొలగించబడినట్లు తన దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఈ అంశాలపై సంబంధిత అధికారులు రికార్డుల ఆధారంగా నిష్పక్షపాతంగా విచారణ ఈ పాటలను కోరారు.
వాటర్ ట్యాంకుల ప్రాంగణంలో అపరిశుభ్రతపై ఆందోళన
వాటర్ ట్యాంకుల ప్రాంగణంలో ఖాళీ బీర్ బాటిళ్లు, మద్యం సీసాలు, ఇతర చెత్తాచెదారం వేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రహరీ గోడ లేకపోవడంతో పరిసరాల్లో అపరిశుభ్రత పెరిగి, దుర్వాసన, దోమల వ్యాప్తి వంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామ ప్రజలందరికీ అవసరమైన మంచినీటి వనరుల పరిసరాలను పరిశుభ్రంగా, సురక్షితంగా ఉంచడం అధికారుల బాధ్యతని పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్థలాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
వాటర్ ట్యాంకుల స్థలానికి సంబంధించిన పాత, ప్రస్తుత రెవెన్యూ రికార్డులను పరిశీలించాల. అధికారిక సర్వే నిర్వహించి స్థల హద్దులు, యాజమాన్య వివరాలను నిర్ధారించాలని
మహేశ్వరం గ్రామ ప్రజల ఆరోగ్యం, మంచినీటి భద్రత, పరిశుభ్రత మరియు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను అధికారులు అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని వనంపల్లి శ్రవణ్ కోరారు. సంబంధిత రికార్డుల ఆధారంగా నిష్పక్షపాతంగా విచారణ జరిపి, వాస్తవాలను వెల్లడించి, చట్టప్రకారం శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన మోర్చా కార్యదర్శి పాండు నాయక్ , సీనియర్ నాయకులు పంతులు , భీమనపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు