బెజ్జూర్ లో భవనం లేక అరకొర వసతులతో ఆసుపత్రి - నూతన భవనం కోసం ప్రజావాణిలో అర్జీ
సూర్య బెజ్జుర్:
బెజ్జూర్ మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రి భవనం లేక అరకొర వసతులతో కొనసాగుతోంది..ప్రభుత్వం ఆసుపత్రిని మంజూరు చేసినా నూతన భవనం నిర్మించలేదు. పాత భవనంలో సరైన వైద్య సదుపాయాలు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. చుట్టుపక్కల 20 గ్రామాల ప్రజలు ఈ ఆసుపత్రిపై ఆధారపడుతున్నారు..వైద్యుల కొరత కూడా ఉండటంతో సేవలు అందడం లేదు. నూతన భవనం నిర్మించి,వైద్యులను నియమించాలని, వార్డు సభ్యులు *గుమ్ముల శ్రీనివాస్* ప్రజావాణిలో అర్జీ నోడల్ అధికారికి అందజేశారు.