BREAKING
ఓటర్ల జాబితా సవరణ లో సాధారణ పొరపాట్లు అశ్వారావుపాలెంలో నూతన పార్క్ ప్రారంభం.. మండలి వెంకట కృష్ణారావు విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం అభివృద్ధి మా ధ్యేయం… ప్రజా సంక్షేమం మా లక్ష్యం! బాల్య వివాహాలపై అవగాహన హైడ్రా (HYDRAA) పేరిట వసూళ్లు: ప్రజలకు కమిషనర్ హెచ్చరిక సీనియర్ టీడీపీ నాయకుడు ఓబుళపతికి నేతల ఘన నివాళి పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివి మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం.. కుటుంబ సభ్యులకు నేతల పరామర్శ గ్రామ అభివృద్ధే నా ధ్యేయం, బాల్య వివాహాలు జరిగితే 1098కు సమాచారం అందించాలి -శక్తి టీం కాళహస్తీశ్వర స్వామి దేవస్థానమునకు బంగారు గాజులు విరాళం మృతదేహాన్ని మోసి మానవత్వం చాటిన కానిస్టేబుల్...... నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య. కానిస్టేబుల్ కు పలువురి ప్రశంసలు..... పండుగకు ఊరెళ్తున్నారా.. ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండండి: మేడిపల్లి సీఐ జెలెందర్ రెడ్డి హెచ్చరిక ఆస్ట్రేలియా వైన్ రంగంలో వ్యవస్థాపక 'ఓట్లీ' కుటుంబానికే తిరిగి రోజ్‌మౌంట్ బ్రాండ్ విక్రయం బెజ్జూర్ లో భవనం లేక అరకొర వసతులతో ఆసుపత్రి - నూతన భవనం కోసం ప్రజావాణిలో అర్జీ జర్మనీ కొత్త కార్మిక మంత్రిగా అలెగ్జాండర్ ష్వైట్జర్ ఎంపిక నంద్యాలలో అత్యాధునిక ‘శ్రీ ధన్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నువ్ప్రారంభించిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్

సూర్య కథనానికి స్పందన.. అగర్‌గూడకు బస్సు సర్వీసు ప్రారంభం

Select Suryaa Now
సూర్య కథనానికి స్పందన.. అగర్‌గూడకు బస్సు సర్వీసు ప్రారంభం

సూర్య, పెంచికల్‌పేట్:అగర్‌గూడ గ్రామ విద్యార్థుల బస్సు కష్టాలపై ‘సూర్య’ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందన లభించింది. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు చొరవతో గ్రామానికి బస్సు సర్వీసు ప్రారంభమైంది. పాఠశాలలకు వెళ్లేందుకు ప్రతిరోజూ సుమారు ఐదు కిలోమీటర్లు నడవాల్సి వస్తోందని, ఆటో చార్జీలు పెరగడంతో రవాణా ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ‘సూర్య’ వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో గ్రామానికి బస్సు సౌకర్యం అందుబాటులోకి రావడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.గ్రామ సర్పంచ్ అల్లూరి రాజేశ్వరి రాజు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తుల సమక్షంలో బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ సౌకర్యంతో విద్యార్థులు పాఠశాలలకు చేరుకోవడంతోపాటు వివిధ అవసరాల నిమిత్తం మండల కేంద్రానికి వెళ్లే గ్రామ ప్రజలకు రవాణా కష్టాలు తగ్గనున్నాయి. బస్సు సర్వీసు ఏర్పాటుకు చొరవ చూపిన ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన ‘సూర్య’ దినపత్రిక కథనంపై కూడా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.