నంద్యాలలో అత్యాధునిక ‘శ్రీ ధన్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నువ్ప్రారంభించిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్
సూర్య, నంద్యాల బ్యూరో:
నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ సమీపంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ డి. శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ డి. కీర్తి రెడ్డి ల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన "శ్రీ ధన్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్" సోమవారం మంత్రి ఫరూక్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రెడ్డిలు ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి ఆసుపత్రిని ప్రారంభించారు.
మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ "నంద్యాల పట్టణంలో అత్యాధునిక వసతులతో 'శ్రీ ధన్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్' ఏర్పాటు కావడం ఎంతో అభినందనీయమన్నారు l. గతంలో తీవ్రమైన కిడ్నీ, యూరాలజీ సమస్యలొస్తే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, కర్నూలు లేదా బెంగళూరు వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని. ఇప్పుడు అలాంటి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు స్థానికంగానే నంద్యాల ప్రజల చెంతకు రావడం సంతోషకరమన్నారు . యువ వైద్యులైన డాక్టర్ డి. శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ డి. కీర్తి రెడ్డి లు ఉన్నత వైద్య విద్యను అభ్యసించి, తమ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించడం హర్షణీయమైన విషయం అన్నారు . పేద, మధ్యతరగతి ప్రజలకు భారం కాకుండా మానవతా దృక్పథంతో, నాణ్యమైన వైద్యాన్ని అందించాలని కోరుతున్నానని తెలిపారు . శ్రీ ధన్వి హాస్పిటల్ ప్రజల మన్ననలు పొందుతూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, వైద్యుల బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ డి. శ్రీకాంత్ రెడ్డి (యూరాలజిస్ట్), డాక్టర్ డి. కీర్తి రెడ్డి (నెఫ్రాలజిస్ట్) మాట్లాడుతూ "నంద్యాల పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన, అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో 'శ్రీ ధన్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్'ను స్థాపించడం జరిగిందని తెలిపారు . ముఖ్యంగా కిడ్నీ, మూత్రపిండాల సంబంధిత వ్యాధులకు అధునాతన పరికరాలు, నిపుణుల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందిస్తామన్నారు. రోగుల అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 24 గంటల ఎమర్జెన్సీ సేవలతో పాటు, అధునాతన ల్యాబ్, ఫార్మసీ సేవలను కూడా ఒకే చోట సమకూర్చామన్నారు . పెద్ద నగరాలకు వెళ్లే పనిలేకుండా ఇక్కడే అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యాన్ని సామాన్యులకు అందుబాటు ధరల్లో అందించడమే మా ప్రధాన ధ్యేయం అన్నారు . మా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసి ఆశీస్సులు అందించిన గౌరవ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి, ఎమ్మెల్యే అఖిల ప్రియ గారికి , ఇతర అతిథులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థలు అధినేత మధుసూదన్ రెడ్డి , కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, మాజీ కౌన్సిలర్ కండే శ్యాంసుందర్ లాల్, బింగుమళ్ల శ్యామ్ సుందర్ గుప్తా, అనుపూర్ ఈశ్వర్, చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పసుపులేటి జనార్ధన్, డాక్టర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
*మధుబాబు, సూర్య బ్యూరో ఇంచార్జి, నంద్యాల జిల్లా*