BREAKING
మచిలీపట్నం పోర్టుకు అనుబంధంగా కాన్‌కార్ లాజిస్టిక్స్‌ హబ్‌ ఏర్పాటుకు ఎంపీ బాలశౌరి కృషి బీసీలకు 34 శాతం రాజకీయ ప్రాతినిధ్యం హర్షణీయం చంద్రబాబు ప్రకటనపై టీడీపీ నాయకుడు కాయల రమణ యాదవ్ హర్షం స్క్రాబుల్ టోర్నమెంట్‌లో పెనుగొండ భాష్యం విద్యార్థికి ద్వితీయ స్థానం చల్లపల్లిలో ఈనెల 15న జాబ్ మేళా ఏల్చూరులో రూ.35.78 కోట్లతో 132/33 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన. గపూర్ నగర్ లో మిగులు భూమిపై విచారణ జరిపించాలి దసరా సెలవుల జోష్.. ట్యాంక్ బండ్‌కు పోటెత్తిన పర్యాటకులు! కండ్రికలో పలగాని బాబురావు పార్కు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోనసీమ దసరా వైభవం: అమలాపురంలో అంబరాన్నంటే ఉత్సవాలు. గాయత్రీ దేవి అలంకారంలో వాసవీ అమ్మవారు పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో వినతుల స్వీకరణ. ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ఛార్జీలపై తెలంగాణ ప్రభుత్వం పునఃసమీక్ష భక్తులకు సౌకర్యవంతమైన దర్శనమే లక్ష్యం సమాచార హక్కు చట్టం దరఖాస్తులకు గడువులోగా సమాధానాలివ్వాలి ప్రభుత్వ శాఖల అధికారులకు డీఆర్ఓ ఏ. మలోల ఆదేశం సింగరకొండలో వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం.

బాల్య వివాహాలపై అవగాహన

Select Suryaa Now
బాల్య వివాహాలపై అవగాహన

నగరం, మేజర్ న్యూస్: 
2030 సంవత్సరం నాటికి బాల్యవివాహాలను అంతం చేయాలనే లక్ష్యాన్ని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు చేపట్టిన చారిత్రాత్మక కార్యక్రమం విజయవంతం చేసేందుకు తమ మద్దతు, సహకారం పూర్తిగా అందజేస్తామని స్థానిక సొసైటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్ మెంట్ (సిఫార్డు) సంస్థ డైరెక్టర్ కె. రవి ప్రదీప్ హామీ ఇచ్చారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక మండల పరిధిలోని నగరం ఎస్టీ కాలనీ, దాసరిపాలెం, ఏలేటిపాలెం తదితర గ్రామాల్లో బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు విజయదశమి సెలవులు కారణంగా మారుమూల ప్రాంతాలకు చెందిన బాలికలను ఒక చోట చేర్చి వారికి అవగాహన కల్పించారు. అనంతరం 18 సంవత్సరాలు నిండిన తరువాతే వివాహం చేసుకుంటామని బాలికలు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ బడుగు కిషోర్ వాలంటీర్లు శ్రీనివాసరావు దేవయ్య తదితరులు పాల్గొన్నారు.