BREAKING
భక్తులకు సౌకర్యవంతమైన దర్శనమే లక్ష్యం సమాచార హక్కు చట్టం దరఖాస్తులకు గడువులోగా సమాధానాలివ్వాలి ప్రభుత్వ శాఖల అధికారులకు డీఆర్ఓ ఏ. మలోల ఆదేశం సింగరకొండలో వైభవంగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం. బొల్లారంలో దారుణం: ఐదేళ్ల చిన్నారి అపహరణ, హత్య కేసును ఛేదించిన పోలీసులు! డబిల్‌పూర్ చెరువు కట్టపై రోడ్డు ప్రమాదం.. బొలెరో ఢీకొని నాగులూరి సురేష్ మృతి నియోజకవర్గ జనసేన సమన్వయకర్తలు ముగ్గురు. నాణ్యతలేని ఇన్సులేటర్లు- పొంచి ఉన్న ప్రాణగండం బంట్వారం మోడల్ స్కూల్లో స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టు సంతానానికి భారం కావద్దని తండ్రి ఆత్మహత్య... రేపు నాగాయలంక తీరంలో నాగబాబు పర్యటన మడ అడవుల పునరుద్ధరణకు శ్రీకారం.. అశ్వారావుపాలెంలో విగ్రహం, మినీ పార్క్ ప్రారంభోత్సవం ప్రజావాణి ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అక్రమ ర్యాంపులు తొలగింపు రోడ్డు వెడల్పు పనులకు ప్రజలు సహకరించాలి-సర్పంచ్ తోగరి భూషణ్ ఓటర్ల జాబితా సవరణ లో సాధారణ పొరపాట్లు అశ్వారావుపాలెంలో నూతన పార్క్ ప్రారంభం.. మండలి వెంకట కృష్ణారావు విగ్రహావిష్కరణకు సర్వం సిద్ధం అభివృద్ధి మా ధ్యేయం… ప్రజా సంక్షేమం మా లక్ష్యం!

పండుగకు ఊరెళ్తున్నారా.. ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండండి: మేడిపల్లి సీఐ జెలెందర్ రెడ్డి హెచ్చరిక

Select Suryaa Now
పండుగకు ఊరెళ్తున్నారా.. ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండండి: మేడిపల్లి సీఐ జెలెందర్ రెడ్డి హెచ్చరిక

మేడిపల్లి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 12): పండుగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు స్వగ్రామాలకు వెళ్లే ప్రజలు ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మేడిపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జెలెందర్ రెడ్డి సూచించారు. పండుగ సెలవుల నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలు పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు వెళ్లే అవకాశం ఉండటంతో, తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే దొంగతనాలను అరికట్టడంతో పాటు విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవచ్చని తెలిపారు.ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు తలుపులకు గట్టి తాళాలు వేయాలని, వీలైతే సెంట్రల్ లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రాత్రి వేళల్లో ఇంటి పరిసరాల్లో వెలుతురు ఉండేలా చూసుకోవాలని, నగదు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా వెంట తీసుకెళ్లాలని లేదా బ్యాంకు లాకర్లలో భద్రపర్చుకోవాలని కోరారు. ముఖ్యంగా ఒంటరిగా ఉండే ఇళ్లు, అపార్ట్‌మెంట్ల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

తాళం వేసిన ఇళ్లపై ప్రత్యేక నిఘా

తాళం వేసి స్వగ్రామాలకు వెళ్లే వారు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని సీఐ జెలెందర్ రెడ్డి సూచించారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో పోలీసుల గస్తీని పెంచేందుకు వీలవుతుందని తెలిపారు. బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని కాలనీలు, బస్తీల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు తాళం వేసిన ఇళ్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.

ముమ్మరంగా పోలీసుల గస్తీ

పండుగ నేపథ్యంలో మూడు షిఫ్టుల్లో పోలీసు సిబ్బందితో నిరంతరం గస్తీ నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. పగలు, రాత్రి వేళల్లో కాలనీలు, బస్తీల్లో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పరిశీలించడంతో పాటు అనుమానం కలిగించే వాహనాలను తనిఖీ చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, చోరీకి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించినా వెంటనే 100 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని మేడిపల్లి సీఐ జెలెందర్ రెడ్డి కోరారు.

రిపోర్టర్: నర్సయ్య గౌడ్, మేడిపల్లి,మేడ్చల్ జిల్లా.