BREAKING
కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది... ప్రముఖ నటుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం.. ఘనంగా భజరప్ప స్మారక పురస్కార ప్రదానం మానవత్వం చాటిన త్రిపురాంతకం తహసిల్దార్ వాసుదేవరావు..... గుమ్మనూరు కుటుంబ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిసిన పామిడి సీఐ పుష్పగుచ్ఛం అందజేసిన నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోహర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్.. ఏఐ ఫేక్ కంటెంట్‌పై సంచలన పిటిషన్ *ఓటు హక్కుపై గళమెత్తిన కాంగ్రెస్‌* ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యలో మెరిసిన ప్రశాంత్ - బిఆర్ఎవోయు స్నాతకోత్సవంలో బంగారు పతకం

మొయినాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

Select Suryaa Now
మొయినాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

బైక్‌ను ఢీకొన్న కారు.. యువకుడి దుర్మరణం!

తలకు తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలింపు.. అప్పటికే మృతి

మొయినాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదం నింపింది. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో మొయినాబాద్‌కు చెందిన దుబ్బా సుభాష్‌ (35) మృతి చెందాడు. గురువారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో మరో వ్యక్తి కూడా ద్విచక్ర వాహనంపై ఉన్నట్లు తెలిసింది.

పోలీసులకు అందిన ఫిర్యాదు వివరాల ప్రకారం.. మొయినాబాద్‌కు చెందిన సుభాష్‌ ప్రైవేట్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం సుమారు 7 గంటలకు తన ద్విచక్ర వాహనం (TS 07 GK 54525)పై హైదరాబాద్‌ వైపు బయలుదేరాడు. అతనితో పాటు మొయినాబాద్‌ సురభిలో నివాసముంటున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జయావంత్‌ (41) అనే సెంట్రింగ్‌ కార్మికుడు కూడా ఉన్నాడు.

ఈ క్రమంలో హైదరాబాద్‌ వైపు నుంచి వస్తున్న కారు (TS 07 HC 3402)ను డ్రైవర్‌ పూతరి నవీన్‌ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సుభాష్‌ తలకు తీవ్ర గాయాలై రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం భాస్కర్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

మొయినాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 8):