telanagana
మియాపూర్ లో నూతన "సుప్రజ హాస్పిటల్"
Telanagana
15 Oct 2026
54 views
హైదరాబాద్ /ఆల్వాల్, మేజర్ న్యూస్ : మియాపూర్ లో సుప్రజా ఆసుపత్రిని మల్కాజ్గిరు ఎమ్. పి. ఈటల రాజేందర్, ఖుద్బుల్లా పూర్ నియోజక వర్గ ఎమ్. ఎల్. ఏ., వివేకా నంద్ లు ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించారు. గురువారం కార్యక్రమంలో ముందుగా వేదమంత్రోచ్ఛారణల మధ్య జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కొబ్బరికాయ కొట్టి న తర్వాత నిర్వాహకులతో కలసి ముఖ్య అతిధి ఈటల రిబ్బన్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆసుపత్రులు రోగుల భాధలు తీర్చే దేవాలయలుగా విలసీళ్ళాలిఅన్నారు.. నాణ్యతతో కూడిన సేవలందిస్తూ ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలి. నిపుణులైన డాక్టర్లు, అంకితం భావం, సేవాభావం తో పనిచేసే సిబ్బంది, రోగ నిర్ధారణ చేసేందుకు అనుభవగ్నులైనా టెక్నిషియన్స్,శస్త్ర చికిత్సలకు అవసరమైన అత్యాధునిక ఆపరేషన్ తీయేటర్లు,సుశీక్షతులైన అయా విభాగాలలో పట్టాలు పొంది న డాక్టర్లు, అన్నివసతు లతో కూడిన డాక్టర్లు, ఆధునిక బెడ్లు,ఉండాలి. దీనికి తోడు రోగుల పట్ల, రోగితో వచ్చిన సహాయకుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. రోగులను రోగానిర్ధారణ కొరకు చేసేపరీక్షలు అందుబాటులో ఉండే విధంగా చూచు కోవాలని,అత్యవసర చికిత్స విభాగాలను విడిగా ఏర్పాటుచేసి నిరంతరం డాక్టర్ల పర్యవేక్షణ ఉండాలన్నారు.. అలాంటప్పుడే రోగులు నమ్మకం తో ఆసుపత్రికి రావడం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వ నియమ, నిబంధనలకు కట్టుబడి ఆసుపత్రి నిర్వహణ కొనసాగాలని పేర్కున్నారు . మియాపూరు లో సుప్రజ పేరుతో ప్రారంభించిన ఈ ఆసుపత్రి మంచి విలువలను పాటిస్తూ, దినాభివృద్ధి చెండాలని ఆకాంక్షిస్తూ, నిర్వాహకులను అభినందించారు. ఫీజుల విషయం లోకూడా పేద మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. ముఖ్యంగా ప్రజల్లో ఆసుపత్రి పట్ల నమ్మకం కలిగించాలని సూచించారు. ఈ సందర్భంగా హాస్పిట్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్. ఎల్. ఏ., వివేకానంద్. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వొడేపల్లి రాజేశ్వర్ రావు , కూకట్పల్లి అసెంబ్లీ కన్వీనర్ శ్రీకర్ రావు , డా. ప్రసన్న హరికృష్ణ , మియాపూర్ డివిజన్ అధ్యక్షులు లక్ష్మణ్ , బీజేపీ సీనియర్ నాయకులు ప్రీతమ్ రెడ్డి , కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్లు:
National News