కోహెడ మండల కేంద్రంలో బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ కోతలపై నిరసన.
*కోహెడ మండల కేంద్రంలో బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ కోతలపై నిరసన
*కోహెడ ; కోహెడ మండల కేంద్రంలో బి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ కోతలపై నిరసన మరియు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు ఒడితల సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ప్రజా పాలన అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక దేశానికి వెన్నెముక అయినా రైతులకు నిరంతరం 24 గంటల కరెంటు అందిస్తానని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వకుండా యూరియా బస్తాలు సరైన టైంలో ఇవ్వకుండా రైతులను నానా ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ వర్తిస్తుంది కోహెడ మండలం గ్రామాలలో లో వోల్టేజ్ ప్రాబ్లంతో ఒక రోజుకు 20 నుంచి 30 సార్లు ట్రిప్ అవుతుంది దీనివల్ల మోటర్లు కాలడం స్టార్టర్లు పేలడం జరుగుతుంది రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సింగల్ ఫేస్ కరెంటు కూడా 24 గంటలు కరెంటు రావడం లేదు ఎన్నికల టైం లో ఆర్భాటంగా చెప్పి ఈరోజు రైతులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు అందుకే ఈరోజు కోహెడ మండల కేంద్రంలో రైతుల పక్షాన నిలబడి బి.ఆర్. ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించి అక్కడి నుండి సబ్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెరుగు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.
మండల సింగల్ విండో చైర్మన్ మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పిటిసి మండల వైస్ ఎంపీపీ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ ఏఎంసి వైస్ చైర్మన్లు గ్రామ శాఖ అధ్యక్షులు యూత్ నాయకులు మండల పార్టీ నాయకులు రైతులు కరకర్తలు తదితరులు పాల్గొన్నారు.