BREAKING
మహబూబాబాద్ జిల్లాలో విషాదం: బావిలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి ఆకాశాన్ని అంటుతున్న తున్న నిత్యవసర లు ధరలు అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ* *అందమైనబతుకమ్మలతోపోటీపడినమహిళలు* *సర్' ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి* *పేరబోయిన మహేందర్* హత్య కేసులో నిందితుల అరెస్టు... నాటు తుపాకి స్వాధీనం నేటి నుండి భైరవకోనలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు- పర్యావరణ పరిరక్షణకు యువ పారిశ్రామికవేత్త వినూత్న అడుగు -ప్రకృతి సిద్ధ ఉత్పత్తులతో ‘అవనిక్’ సంస్థకు శ్రీకారం ఘనంగా తపస్య ట్రోఫీ ముగింపు వేడుకలు.. రెేపు వీరపనేనిగూడెం సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేత. శ్రీ కృష్ణ హాస్పిటల్ లో ఉచిత వైద్య శిబిరం బీసీల రాజకీయ ప్రాతినిధ్యంలో రాజీ లేదు: స్థానిక సంస్థల్లో 34 శాతం టిక్కెట్లు బీసీలకే – టీడీపీ చారిత్రక నిబద్ధత 11వ తేదీన భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు తుక్కులూరు పర్యటన రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ కార్యదర్శిగా సయ్యద్ యూనిస్ నియామకం మెగా దసరా మేళ.. పలు ఆఫర్లు విశాఖ ప్రజలు వినియోగించుకోవాలి తల సేమియా బాధితుల చిన్నారుల చికిత్సకు కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి చొరవ

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కాంగ్రెస్ ఎంపీల కీలక భేటీ

Select Suryaa Now
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కాంగ్రెస్ ఎంపీల కీలక భేటీ

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కాంగ్రెస్ ఎంపీల కీలక భేటీ

రామగుండం–మణుగూరు రైల్వే లైన్‌పై గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక చర్చలు
రామగుండం–మణుగూరు రైల్వే ట్రాక్ పురోగతిపై కేంద్ర మంత్రిని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్న పెద్దపల్లి ఎంపీ

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, సురేష్ షెడ్కర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులు, ప్రజలకు అవసరమైన రైల్వే సౌకర్యాలపై పలు కీలక అంశాలను మంత్రితో చర్చించారు. ప్రత్యేకంగా పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తన పార్లమెంట్ నియోజకవర్గానికి అత్యంత కీలకమైన రామగుండం–మణుగూరు రైల్వే లైన్ పురోగతిపై మంత్రి అశ్విని వైష్ణవ్‌తో చర్చించారు. సుమారు రూ.4,000 కోట్ల అంచనా పెట్టుబడితో ప్రతిపాదించిన ఈ రైల్వే లైన్* ప్రస్తుత పరిస్థితి, పనుల పురోగతి, తదుపరి చర్యలపై ఎంపీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రామగుండం, పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాల పారిశ్రామిక, వాణిజ్య మరియు రవాణా అభివృద్ధికి ఈ రైల్వే లైన్ ఎంతో కీలకమని ఎంపీ వంశీకృష్ణ మంత్రికి వివరించారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, త్వరితగతిన క్షేత్రస్థాయిలో పురోగతి కనిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందిస్తూ రామగుండం–మణుగూరు రైల్వే లైన్‌కు సంబంధించిన పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని
 ఎంపీకి వివరించినట్లు తెలిపారు.
అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే మంజూరైన ఆర్ఓబి ఎఫ్ఓబి  ల పనులు, నిధుల విడుదల, పనుల అమలులో జరుగుతున్న జాప్యాన్ని* కూడా ఎంపీ వంశీకృష్ణ రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లారు. గత రెండు సంవత్సరాలుగా ఈ అంశాలపై నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నప్పటికీ పనుల్లో ఆలస్యం జరుగుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్మాణ ప్రాంతాల్లో వాటర్ క్లాగింగ్ కారణంగా ప్రజలకు ఇబ్బందులు, ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఎంపీ సూచించారు.
అలాగే పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల రైల్వే స్టేషన్ల అప్‌గ్రేడేషన్ అంశంపైనా రైల్వే శాఖ అధికారులతో ఎంపీ వంశీకృష్ణ చర్చించారు.

రైల్వే అభివృద్ధి కోసం నిరంతర ఫాలోఅప్

పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో రైల్వే మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడం, పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా నిరంతరం కేంద్ర రైల్వే శాఖతో సమన్వయం చేస్తూ ఫాలోఅప్ చేస్తున్నామని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు