కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరుని సేవలో గవర్నర్ సతీమణి జానకి శుక్ల
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 05):ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామివారిని రాష్ట్ర గవర్నర్ సతీమణి జానకి శుక్ల సోమవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు దేవస్థానం చైర్మన్ తటాకం వెంకటేష్ శర్మ, కార్యనిర్వహణాధికారి కట్టా సుధాకర్ రెడ్డి ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు.
స్వామివారికి ప్రత్యేక అభిషేకం
అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో జానకి శుక్ల ప్రత్యేక అభిషేకంలో పాల్గొని స్వామివారికి అర్చనలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు ఆశీర్వచనం అందించారు. దర్శనానంతరం దేవస్థానం అధికారులు స్వామివారి శేషవస్త్రాలు, పట్టువస్త్రాలతో ఆమెను సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.జానకి శుక్ల పర్యటన సందర్భంగా కీసరగుట్ట దేవస్థానం పరిసరాల్లో అధికారులు ప్రత్యేక భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కీసర ఆర్డీవో నల్ల వెంకటరెడ్డి, తహసీల్దార్ యాదగిరి రెడ్డి, ఏసీపీ చక్రపాణి, సీఐ రమేష్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రామలింగం, ఆలయ వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు.
పన్నాల బాల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రతినిధి.