కౌటాల మండల విద్యా వనరుల కేంద్రంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
సూర్య, కౌటాల , భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా కౌటాల మండల విద్యా వనరుల కేంద్రం (MRC) వద్ద మండల విద్యాధికారి (MEO) నానాజీ ఆధ్వర్యంలో గాంధీ జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయులు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా MEO నానాజీ మాట్లాడుతూ... బాపు చూపిన అహింస, సత్యం అనే మార్గాల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. శాంతి, సహనం వంటి సుగుణాలతోనే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఇలాంటి గొప్ప మహానుభావుల జీవన విధానాలను, ఆదర్శాలను వివరించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. అక్టోబర్ 2 ప్రత్యేకతను గుర్తుచేస్తూ, 'స్వచ్ఛ భారత్' సంకల్పంతో మన చుట్టూ ఉన్న పరిసరాలను, దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మన అందరి కనీస బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చింతలమనేపల్లి MEO జయరాజు, ముత్తంపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు హనుమంతు పాల్గొన్నారు. వారితో పాటు ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఎడ్ల తిరుపతి, శైలజ, శ్రీనివాస్, రాములు, దౌలత్, సాయినాథ్, అశోక్, శివాజీ, సుధాకర్, కిరణ్, సాయికిరణ్ మరియు సీఆర్పీలు (CRP) లాలాజీ, లులాజీ తదితరులు పాల్గొన్నారు