బతుకమ్మలతో.. మూడో వార్డులో సందడి!
చౌటుప్పల:తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు చౌటుప్పల్ మున్సిపాలిటీలో అంబరాన్నంటాయి. ఎంగిలిపూల బతుకమ్మ తొలి రోజు వేడుకలను పురస్కరించుకుని శనివారం మున్సిపాలిటీలోని మూడో వార్డులో నిర్వహించిన సంబరాల్లో భాజపా మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్ పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబమని ఆమె కొనియాడారు. ఈ వేడుకల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.