BREAKING
శ్రీరామలో మేధో సంపత్తి హక్కులపై అవగాహన రూపురేఖలు మార్చేలా తుడా మెగా ప్లాన్ -ట్రాఫిక్ ఫ్రీ కారిడార్లు, 100 అడుగుల గ్రీన్ ఫీల్డ్ రోడ్లతో అభివృద్ధి ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ ఆలయంలో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో హుండీ ప్రారంభం విపత్తు నిర్వహణలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత కీలకం పశుగ్రాస సాగుకు దరఖాస్తుల ఆహ్వానం కొత్తమ్మతల్లి సేవలో ఖాకీలు రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైన ఎస్.రాయవరం విద్యార్థినులు! పెనుగొండ వాసవి అమ్మవారి శరన్నవరాత్రులకు ఘన ఏర్పాట్లు ★పది రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనం మానసిక ఆరోగ్యంపై అపోహలు వీడాలి! ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రజా సమస్యల వినతులు స్వీకరణ... బీసీలకు ద్రోహం చేసింది వైసీపీనే! చెన్నైలో సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ ఢిల్లీలో సీఈసీపై నిరసనల వేళ.. నీలంకరైలోని నివాసంలో గంటపాటు ఏకాంత చర్చలు. జిల్లా జడ్పీ సీఈఓ గా టి.ఎన్.శోభన్ బాబు

రూ 12.50 కోట్లతో అభివృద్ధి పనులు

Select Suryaa Now
రూ 12.50 కోట్లతో అభివృద్ధి పనులు

 

నేటి దినపత్రిక సూర్య బ్యూరో

రాజమహేంద్రవరం :

స్థానిక 43వ డివిజన్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డివిజన్‌లో ఇప్పటికే రూ.65 లక్షలతో రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేశామని, ఆర్వీ నగర్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన మహిళా పార్కును రూ.75 లక్షలతో ఆధునీకరించామని వెల్లడించారు. రూ.37 లక్షలతో కోరుకొండ రోడ్డులోని దుర్గమ్మ ఆలయం వద్ద ప్రధాన మురుగునీటి కాలువ, బ్రదర్న్ చర్చి జంక్షన్ వద్ద కల్వర్టు నిర్మాణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్‌లో వర్షపు నీటి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడమే లక్ష్యంగా పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 2003లో దుర్గమ్మ ఆలయం వద్ద నిర్మించిన ప్రధాన డ్రైన్‌ సరైన స్థితిలో లేకపోవడంతో వర్షాలు కురిసినప్పుడు రోడ్లపైకి నీరు చేరి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు రావడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోందన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు పాత డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు, నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న క్రాస్ కేబుళ్లను తొలగించి, మ్యాన్‌హోల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సుమారు 37 మీటర్ల మేర ప్రధాన డ్రైన్‌ను పటిష్టమైన ఆర్‌సీసీ నిర్మాణంగా అభివృద్ధి చేసి, అవసరమైన చోట్ల స్లాబులు, మ్యాన్‌హోళ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దీనివల్ల డ్రైనేజీ నిర్వహణ సులభతరమవడంతో పాటు నీటి ప్రవాహం సజావుగా సాగుతుందన్నారు. అలాగే బ్రదర్న్ చర్చి జంక్షన్ వద్ద బాక్స్ కల్వర్టు నిర్మాణం చేపట్టి, అధికంగా వచ్చే మురుగునీటిని ప్రత్యామ్నాయ మార్గంలోకి మళ్లించనున్నట్లు వివరించారు. దీంతో కోరుకొండ రోడ్డు పరిసర ప్రాంతాలతో పాటు దిగువ ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే సమస్యను నివారించవచ్చన్నారు. ఇప్పటికే శిథిలావస్థకు చేరిన దిగువ డ్రైనేజీ వ్యవస్థపై ఒత్తిడి తగ్గించేందుకు కూడా ఈ నిర్మాణం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

*రూ.12.50 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు*

ఇదే డివిజన్‌లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు హెచ్‌ఏఎం పథకం కింద అదనంగా రూ.8.50 కోట్లతో డ్రైనేజీ పనులు, రూ.4 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులు మంజూరయ్యాయని తెలిపారు. ఈ పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మొత్తం సుమారు రూ.12.50 కోట్లతో డివిజన్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి డివిజన్‌లోనూ ప్రజలకు అవసరమైన రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రానున్న రోజుల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారుల సహకారం, అనుభవజ్ఞులైన నాయకుల సూచనలతో సమిష్టిగా పనిచేస్తూ నగర అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి పనులను వ్యక్తిగత విజయాలుగా కాకుండా కూటమి ప్రభుత్వ సమిష్టి విజయంగా భావిస్తున్నానని స్పష్టం చేశారు. నగరానికి అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాజమహేంద్రవరం ప్రతిష్ఠను మరింత పెంచడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.