BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

కాలనీల సమస్యలను పరిష్కరించాలి:ఎంఎంసీ కమిషనర్‌కు ఎమ్మెల్యే మల్లారెడ్డి వినతి

Select Suryaa Now
కాలనీల సమస్యలను పరిష్కరించాలి:ఎంఎంసీ కమిషనర్‌కు ఎమ్మెల్యే మల్లారెడ్డి వినతి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్:మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని నాగారం, జవహర్‌నగర్ డివిజన్లలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కోరారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడటంతో పాటు, ఆయన కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాగారం, జవహర్‌నగర్ డివిజన్లలో డ్రైనేజీ వ్యవస్థ, వీధిదీపాలు, సీసీ రోడ్లు, పారిశుధ్యం తదితర సమస్యలను కమిషనర్‌కు వివరించారు. ఆయా కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, సమస్యల పరిష్కారానికి మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.ఎమ్మెల్యే మల్లారెడ్డి వినతిపై కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి సానుకూలంగా స్పందించారు. సంబంధిత సమస్యలను పరిశీలించి, వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.