జెమ్-కో కంపెనీ తాత్కాలికంగా మూసివేత
సూర్య, సెంటినరీ కాలనీ : అడ్రియాల గనిలో ప్రైవేట్ కంపెనీ అయిన జెమ్-కో కంపెనీ తాత్కాలికంగా మూసివేశారు. మొదటి సీమ్ లోని ప్యానెల్-3 లో 33 లక్షల బొగ్గు తీశారు. ఫిబ్రవరి-2025 లో ఈ పానెల్ ను మూసివేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్యానెల్ లో గ్యాస్ రావడంతో మూసివేస్తూ, తెరుస్తూ ఎట్టకేలకు యంత్రాలను బయటికి తరలించారు. కాగా ఈ క్రమంలో డెవెలప్మెంట్ పనులు చేస్తున్న జెమ్-కో కంపెనీ కి పని స్థలాల కొరత ఏర్పడింది. సుమారు 60 మంది ఉద్యోగులకు, కార్మికులకు పనులు నిలిపివేశారు. ఈ విషయంపై జెమ్-కో ఇంచార్జి వంగేటి నరసింహారావు ను వివరణ కోరగా కొన్ని నెలలు తాత్కాలికంగా పనులు నిలిపివేశామని తెలిపారు. సింగరేణి అడ్రియాల జీఎం కొలిపాక నాగేశ్వరరావు వివరణ కోరగా మరో మూడు నుంచి నాలుగు నెలల్లో జెమ్-కో కంపెనీకి పనులు అప్పగిస్తామని తెలిపారు.