BREAKING
ఆధునిక సాంకేతికతతో విద్యుత్ రంగం, సరికొత్త ప్రగతికి సంకేతం. రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్ ఇవ్వాలి - రావిపాడు లో జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి

జీహెచ్ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు

Select Suryaa Now
జీహెచ్ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు

 

గాంధీ జయంతి నాడు మాంసం దుకాణాల మూసివేతపై వివాదం

ఫిబ్రవరిలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించారని పిటిషనర్ ఆరోపణ

కమిషనర్‌పై చర్యలు తీసుకుని, రూ.50,000 జరిమానా విధించాలని అభ్యర్థన

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి:
గాంధీ జయంతి సందర్భంగా నగరంలో మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌కు తెలంగాణ హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరిలో కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించారంటూ దాఖలైన పిటిషన్‌పై నిన్న‌ విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.
తార్నాకకు చెందిన న్యాయ విద్యార్థి వడ్ల శ్రీకాంత్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. గతంలో ఇలాంటి ఉత్తర్వులపై శ్రీకాంత్ కోర్టును ఆశ్రయించగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. స్లాటర్‌హౌస్‌లు, మాంసం దుకాణాల మూసివేతకు సంబంధించిన ఏ ఉత్తర్వులైనా జీహెచ్ఎంసీ చట్టం-1955 నిబంధనలకు అనుగుణంగానే ఉండాలని స్పష్టం చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది విజయ్ గోపాల్ కోర్టుకు వివరించారు. అయితే ఆ ఉత్తర్వులను పట్టించుకోకుండా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా స్లాటర్‌హౌస్‌లు, రిటైల్ మాంసం, బీఫ్ దుకాణాలను మూసివేయాలని సెప్టెంబర్ 30న జీహెచ్ఎంసీ పత్రికా ప్రకటన విడుదల చేసిందని ఆయన వాదించారు. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం రూపొందించిన నిబంధనలను గెజిట్‌లో ప్రచురించకుండా ఈ నిర్ణయం తీసుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. మాంసం దుకాణాల మూసివేత వ్యాపారుల ప్రాథమిక హక్కులను (ఆర్టికల్ 19(1)(జి)) ఉల్లంఘిస్తుందని తెలిపారు.
కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించిన కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని, ఆయనకు రూ.50,000 జరిమానా విధించాలని పిటిషన్‌లో కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం, కమిషనర్‌కు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను వచ్చేనెల 2వ తేదీకి వాయిదా వేసింది.