telanagana
జమ్మికుంట మార్కెట్ యార్డులో కొత్త పత్తికి రూ.8,600 ధర
సూర్య జమ్మికుంట:జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 32 ట్రాలీల్లో 158 క్వింటాళ్ల కొత్త పత్తి రాగా, క్వింటాకు గరిష్టంగా రూ.8,600 ధర పలికింది.చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న-సదానందం మాట్లాడుతూ, రైతులు పత్తిని శుభ్రపరిచి ఆరబెట్టి నేరుగా యార్డుకు తెచ్చి మంచి ధర పొందాలని, దళారులకు తక్కువ ధరకు అమ్మి నష్టపోవద్దని కోరారు. ధర, తూకంలో సమస్య వస్తే తమ దృష్టికి తేవాలని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.అనంతరం వ్యాపారస్తులతో సమావేశమై రైతులకు పోటీ ధర ఇప్పించాలని, అమ్మిన రోజే డబ్బులు, తక్ పట్టీ ఇవ్వాలని, మద్దతు ధర రూ.8,667 కంటే తక్కువ పలికితే కపాస్ కిసాన్ యాప్ ద్వారా సీసీఐకి అమ్మేలా సూచించాలని ఆదేశించారు.