BREAKING
వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు బుడ్డే హనుమంతరెడ్డికి మెట్టు విశ్వనాథ్‌రెడ్డి నివాళులు ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు చేనేత కార్మికుల చెవుల్లో పూలు పెట్టిన కూటమి ప్రభుత్వం గాంధీ జయంతి సందర్భంగా వినూత్న నిరసన.. రోడ్డు ప్రమాదంలో "సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి" ???? ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ : *బీసీలకు 34% - వెనక్కి తగ్గేదిలే* _➖ఎమ్మెల్యే చంటి_ పల్లెల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం తురకపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ రెండవ పట్టణ సీఐగా సుధాకర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ గాంధీ, శాస్త్రి విలువలను ఆచరించాలి రూ.15 లక్షల విలువైన కిట్ల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి* మహాత్మా గాంధీ ఆశయాలు సాధించేందుకు అందరూ వారి బాటలో పయనించాలి.... రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి.. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేసి తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి గుంతకల్లులో వామపక్ష, కాంగ్రెస్‌, వైఎస్సార్‌సీపీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన రాయలసీమ రైతు సత్తా ప్రపంచానికి చాటుతామని స్పష్టం:నారా లోకేష్.. రైతులకు శనగల పంపిణీ సజావుగా చేపట్టాలి ఎమ్మెల్యేకు బీజేపీ నాయకుల వినతి యస్.వి. కళాశాలలో ఘనంగా గాంధీ జయంతి

గ్రాడ్యుయేట్లు బాధ్యతగా ఓటరు నమోదు చేసుకోవాలి: కౌన్సిలర్ డా. ఉదయజ్యోతి

Select Suryaa Now
గ్రాడ్యుయేట్లు బాధ్యతగా ఓటరు నమోదు చేసుకోవాలి: కౌన్సిలర్ డా. ఉదయజ్యోతి

*గ్రాడ్యుయేట్లు బాధ్యతగా ఓటరు నమోదు చేసుకోవాలి: కౌన్సిలర్ డా. ఉదయజ్యోతి*

ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై బీఆర్‌ఎస్ నాయకుల అవగాహన సమావేశం

అశ్వారావుపేటలో 1,000 గ్రాడ్యుయేట్ ఓట్ల నమోదే లక్ష్యం: కాసాని చంద్రమోహన్

అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలి: సత్యవరపు సంపూర్ణ

రాకేష్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలి: బీఆర్‌ఎస్ నాయకుల పిలుపు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బీఆర్‌ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పెరయిగూడెంలోని తగరం జగన్నాథం స్వగృహంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ డా. ఉదయజ్యోతి మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు యువత, విద్యార్థులు, నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయని అన్నారు. ప్రజా సమస్యలను చట్టసభల్లో సమర్థంగా ప్రస్తావించే నాయకులను ఎన్నుకునే బాధ్యత గ్రాడ్యుయేట్లపై ఉందన్నారు. అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు కావడంతో పాటు బాధ్యతాయుతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

బీఆర్‌ఎస్ నాయకుడు కాసాని చంద్రమోహన్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, నవంబర్‌ 6 వరకు కొనసాగుతుందని తెలిపారు. గత ఎన్నికల్లో అశ్వారావుపేట ప్రాంతం నుంచి 756 మంది ఓటర్లను నమోదు చేయించామని, ఈసారి 1,000కిపైగా గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

అశ్వారావుపేట పట్టణంతో పాటు వినాయకపురం, తిరుమలకుంట, నారాయణపురం, గుమ్మడివల్లి తదితర ప్రాంతాల్లో ఓటరు నమోదు కోసం బాధ్యులను నియమించినట్లు తెలిపారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి గెలుపు కోసం పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన పట్టభద్రులు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డిగ్రీ సర్టిఫికెట్, ఫొటోలను పీడీఎఫ్ రూపంలో వాట్సాప్ ద్వారా పంపించి ఓటరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితమని, అర్హులైన పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

బీఆర్‌ఎస్ టౌన్ మాజీ అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన గ్రాడ్యుయేట్లందరూ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అర్హులైన పట్టభద్రులను గుర్తించి నమోదు ప్రక్రియలో సహకరించాలని సూచించారు. రాకేష్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు కాసాని నాగశేష పద్మ, డాక్టర్ భూక్య ప్రసాద్, గుడవర్తి వెంకటేశ్వరరావు, సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి జుజ్జురపు శ్రీరామమూర్తి, మొటూరి మొహన్ శెట్టిపల్లి రఘురాం జుజ్జురపు రాంబాబు మాజీ సర్పంచ్ కొండయ్య మాజీ సర్పంచ్ శివప్రసాద్ మాజీ ఉపసర్పంచ్ జగన్నాథం నరేష్ మంగరాజు అమీర్ , చిన్నబ్బాయ్, కార్యకర్తలు, యువత, స్థానికులు పాల్గొన్నారు.

 

సూర్య ప్రతినిధి మునీర్ అశ్వారావుపేట