BREAKING
ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు చేనేత కార్మికుల చెవుల్లో పూలు పెట్టిన కూటమి ప్రభుత్వం గాంధీ జయంతి సందర్భంగా వినూత్న నిరసన.. రోడ్డు ప్రమాదంలో "సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి" ???? ఏలూరు జిల్లా : ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం : ది డెస్క్ : *బీసీలకు 34% - వెనక్కి తగ్గేదిలే* _➖ఎమ్మెల్యే చంటి_ పల్లెల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం తురకపల్లిలో రూ.10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ రెండవ పట్టణ సీఐగా సుధాకర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ గాంధీ, శాస్త్రి విలువలను ఆచరించాలి రూ.15 లక్షల విలువైన కిట్ల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి* మహాత్మా గాంధీ ఆశయాలు సాధించేందుకు అందరూ వారి బాటలో పయనించాలి.... రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలి.. తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను నిలిపివేసి తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలి గుంతకల్లులో వామపక్ష, కాంగ్రెస్‌, వైఎస్సార్‌సీపీ పార్టీల ఆధ్వర్యంలో నిరసన రాయలసీమ రైతు సత్తా ప్రపంచానికి చాటుతామని స్పష్టం:నారా లోకేష్.. రైతులకు శనగల పంపిణీ సజావుగా చేపట్టాలి ఎమ్మెల్యేకు బీజేపీ నాయకుల వినతి యస్.వి. కళాశాలలో ఘనంగా గాంధీ జయంతి కోట్ల రఘు ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు * జనసేన సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన వైసీపీ ముఖ్య నాయకులు

గాంధీ ఆశయాలే ప్రజా పాలనకు దిక్సూచి

Select Suryaa Now
గాంధీ ఆశయాలే ప్రజా పాలనకు దిక్సూచి


మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో బాపూజీకి ఘన నివాళులు.. సత్యం, అహింస, సామాజిక న్యాయమే ప్రభుత్వ లక్ష్యం: దయాకర్‌రెడ్డి
 

ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలోని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం బాపూజీకి ఘన నివాళులు అర్పించారు. క్యాంప్ కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సామాజిక న్యాయం, సమానత్వ మార్గాలే ప్రజా పాలనకు స్ఫూర్తిదాయకమని అన్నారు. తెలంగాణలో ప్రజల సంక్షేమం, సామాజిక సమానత్వం, న్యాయం ప్రధానంగా పాలన కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ నాయకులు, ప్రజాప్రతినిధులు బాపూజీకి ఘనంగా నివాళులు అర్పించారు. దేశానికి గాంధీజీ అందించిన సత్యం, అహింస సిద్ధాంతాలు నేటి తరానికి కూడా మార్గదర్శకమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఏదులాపురం మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, అశ్వారావుపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్‌బాబు, ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోత్ కిషోర్ నాయక్, ఐఎన్‌టీయూసీ జనరల్ సెక్రటరీ మహమ్మద్ రజాక్, మాజీ ఎంపీపీ బోడా మంగీలాల్, నాయకులు కోసూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.