కోట్ల రఘు ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు * జనసేన సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరిన వైసీపీ ముఖ్య నాయకులు
భోగాపురం, అక్టోబర్ 2, (మేజర్ న్యూస్):
భోగాపురం మండలం జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో పూసపాటిరేగ మండలం గుంపాం పంచాయతీకి చెందిన పలువురు వైసీపీ ముఖ్య నాయకులు జనసేన పార్టీలో చేరారు. పూసపాటిరేగ మండలం కొవ్వాడ మాజీ సర్పంచ్, జనసేన సీనియర్ నాయకుడు కోట్ల రఘు ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై కొత్తగా పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి జనసేనలోకి ఆహ్వానించారు. ఆల్తి అప్పలనాయుడు, బొబ్బాది శంకర్ ఆధ్వర్యంలో గుంపాం పంచాయతీకి చెందిన వైసీపీ ముఖ్య నాయకులు మహంతి రామకృష్ణ, బొబ్బాది పైడినాయుడు, వీర మహిళ బొబ్బాది సంతోషికుమారి, బొబ్బాది సంతోష్, బొబ్బాది గోవింద్, బొబ్బాది మహేష్, అలమండ రాజశేఖర్, సెగల గౌరి, కార్తీక రవికుమార్, బంగారు శ్రీను తదితరులు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సంక్షేమం కోసం పార్టీ చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై తాము జనసేనలో చేరుతున్నట్లు వారు తెలిపారు. పార్టీలో చేరిన వారందరికీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కోట్ల రఘు చొరవతో గుంపాం పంచాయతీలో జనసేనకు మరింత బలం చేకూరిందని పార్టీ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ, ప్రజలకు మరింత చేరువయ్యేలా కార్యక్రమాలను విస్తృతం చేయడంలో కోట్ల రఘు కీలకంగా వ్యవహరిస్తున్నారని వారు తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.