ఎండిపోయిన వరి పంటను పరిశీలించిన భాజపా నాయకులు
సూర్య బాన్సువాడ రూరల్: బాన్సువాడ మండలంలోని కోనాపూర్, హన్మజిపేట్, కాలునాయక్ తండా లలో ఎండిపోయిన వరి పంటను బీజేపీ నాయకులు, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మినారాయణ స్థానిక భాజపా నాయకులతో కలిసి మంగళవారం పరిశీలించారు. సుమారుగా 200 ఎకరాల్లో వరి పంట ఎండిపోవడంతో ఈ ప్రాంత రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన అన్నారు. పంట పొలాలను పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రైతులకు జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా కృషి చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను తెలుసుకుని వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి బాన్సువాడ రూరల్ అధ్యక్షులు మజ్జిగ శ్రీనివాస్ గారు బిజెపి నాయకులు పైడిమల్ లక్ష్మీనారాయణ నాగరాజ్ సాయిబాబా శివకుమార్ లక్ష్మణ్ దత్తు సంజీవులు సందీప్ సురేష్ రాథోడ్ మోహన్ తదితరులు ఉన్నారు.