BREAKING
వాషింగ్టన్ డిసి గోల్ఫ్ కోర్సులో వందలాది చెట్ల నరికివేత...ట్రంప్ యంత్రాంగంపై ఫెడరల్ జడ్జి తీవ్ర ఆగ్రహం రీ సర్వే పేరుకే న్యాయం జరగడం లేదు. యూఎస్ యూ తనిఖీ నుంచి ఇటలీ నిష్క్రమణకు ముప్పు-సెంట్రల్ బ్యాంక్ హెచ్చరిక భాకారపేట సీఐ గా పి. తిమ్మయ్య. సెప్టా సంక్షోభం సమయంలో స్పానిష్ జలాల్లోకి మొరాకో నావికాదళ నౌకలు అక్టోబర్ 15న చించినాడ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిలిపివేత..కలెక్టర్ మహేష్ కుమార్. హనుమాన్ నగర్‌లో మహిళల చే దసరా వేడుకలు ప్రజా నాయకుడు కన్నుమూత! కొత్తూరులో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పటిష్ట పోలీసు బందోబస్తు ప్రజాసేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలి స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలి రైతుల భూములు లాక్కుంటూ కన్నీళ్లు మిగులుస్తారా..? బాధిత రైతుకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శ 17.55 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడులే కీలకం…:సి ఐ ఐ ప్రాంతీయ సదస్సుకు హాజరైన కలెక్టర్ మహేష్ కుమార్..

బతుకమ్మ వేడుకల్లో తలసేమియా చిన్నారులు

Select Suryaa Now
బతుకమ్మ వేడుకల్లో తలసేమియా చిన్నారులు

బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకు ఇవ్వమ్మా... ఉయ్యాలో
– బతుకమ్మ వేడుకల్లో తలసేమియా చిన్నారులు

ఖమ్మం, సూర్య (మేజర్ న్యూస్):
బతుకమ్మా.. బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకు ఇవ్వమ్మా.. ఉయ్యాలో అంటూ తలసేమియా చిన్నారులు ఆడిపాడారు. ఆదివారం సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వైరా రోడ్డులోని రితన్య ఆసుపత్రి వద్ద తలసేమియా చిన్నారులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులు, తల్లిదండ్రులు పూలను సేకరించి భారీ బతుకమ్మను తయారు చేశారు. గౌరమ్మ, బతుకమ్మలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చిన్నారులు ఆడిపాడుతూ.. తమకు బతుకునిస్తున్న రక్తదాతలను చల్లంగా చూడమ్మ అంటూ గౌరమ్మను వేడుకున్నారు. ఈ వేడుకల్లో డాక్టర్‌ డి.నారాయణమూర్తి, సంస్థ పౌండర్‌ అనిత, సంస్థ బాధ్యులు ప్రొద్దుటూరి పావని, పి.ఉదయ్‌భాస్కర్, పి.రవిచందర్‌ తదితరులు పాల్గొన్నారు.