బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
నిమజ్జన తొట్టికి మరమ్మతులు.. వీధిదీపాల సరిచేత
బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రంగాపూర్ గ్రామంలో సర్పంచ్ నేనావత్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. బతుకమ్మల నిమజ్జనం కోసం లింగాల బావి వద్ద ఉన్న నీటి తొట్టికి మరమ్మతులు చేయించారు. గ్రామంలో వీధిదీపాలను సైతం సరిచేయించారు. పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను సర్పంచ్ దగ్గరుండి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల