అసెంబ్లీలో భద్రాచలం రహదారి సమస్యపై ప్రశ్నించాలి.
భద్రాచలం రహదారి సమస్యపై హరీష్ రావుకు వినతి.
దుమ్ముగూడెం,సూర్య న్యూస్(కల్లూరి సుమన్):
భద్రాచలం నుండి వాజేడు వరకు ఉన్న అధ్వానపు రహదారి సమస్యను శాసనసభలో లేవనెత్తాలనీ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుకు యువజన నాయకుడు రావులపల్లి పృథ్వి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పార్టీ ఇంచార్జి రావులపల్లి రాంప్రసాద్ తనయుడైన పృథ్వి, హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిసి ఏజెన్సీ ప్రాంత ప్రజలు గుంతల రోడ్ల వల్ల పడుతున్న ఇబ్బందులను కూలంకషంగా వివరించారు. నిత్యం వేలాది మంది ప్రయాణించే ఈ రహదారి పునర్నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా అసెంబ్లీలో గళమెత్తాలని కోరగా, రాబోయే సమావేశాల్లో ఈ సమస్యపై ఖచ్చితంగా మాట్లాడతానని హరీష్ రావు హామీ ఇచ్చారు.