BREAKING
పీ4 స్ఫూర్తికి ఘన విజయం.. కృపారావుకు బంగారు పతకం సీతమ్మవారి పాదాల వద్ద భక్తుల సౌకర్యాల పరిశీలన ఇంద్రకీలాద్రిపై పచ్చదనం, ఘాట్‌రోడ్ పనుల పరిశీలన అమ్మవారి అలంకరణకు పట్టు చీరల అందజేత విజయవాడ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని చాటే మహోత్సవాలకు ఆహ్వానం - దసరా శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్‌–2.0కు మంత్రులకు ఎంపీ కేశినేని చిన్ని ఆహ్వానం మృతి చెందిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి రూ.లక్ష సాయం మహిళలకు కుట్టుమిషన్ల అందజేత ఏడు కుటుంబాలకు రూ.3.20 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఓటర్ల జాబితాపై మరోసారి ఇంటింటి పరిశీలన బాలల స్నేహపూర్వక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా మీ ఆహార సేవకు అమ్మ ఆశీస్సులుండాలి.. : ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ మహోత్సవాలకు మహా సన్నాహాలు... - మూడు ప్ర‌ధాన ఉత్స‌వాల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు గుంతలు లేని నగరంగా విజయవాడను తీర్చిదిద్దాలి : కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడలో ఐదు అర్బన్ క్రెచ్‌లు - రూ.50 లక్షలతో ఏర్పాటు.. రూ.45 లక్షలు డోనర్ సంస్థ సహకారం వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి త్వరలో చర్యలు - 22 రోజుల సహాయ నిరాకరణపై రెవెన్యూ మంత్రి హామీ

సిద్ధార్థ ఫ్లైఓవర్‌పై చీకట్లు.. ప్రమాదాలకు ఆహ్వానం

Select Suryaa Now
సిద్ధార్థ ఫ్లైఓవర్‌పై చీకట్లు..  ప్రమాదాలకు ఆహ్వానం

రాత్రివేళ వాహనదారుల అవస్థలు.. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి

తాడిగడప, మేజర్ న్యూస్ : ఎన్టీఆర్ సర్కిల్ నుంచి నేరుగా తాడిగడప 100 అడుగుల రోడ్డుకు చేరుకునేందుకు కీలకమైన సిద్ధార్థ కళాశాల ఫ్లైఓవర్‌పై రాత్రివేళ చీకట్లు వాహనదారులకు ఇబ్బందిగా మారాయి. గన్నవరం విమానాశ్రయానికి వెళ్లేందుకు కూడా ఇదే ప్రధాన మార్గం కావడంతో రాత్రివేళ రాకపోకలు అధికంగా ఉంటాయి. గతంలో సుమారు 80 శాతం పనులు పూర్తయిన ఈ వంతెనను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధార్థ కళాశాల యాజమాన్యం సహకారంతో పూర్తి చేసి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఫ్లైఓవర్‌పై శబ్ద కాలుష్య నివారణకు ఇరువైపులా ఇనుప బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ సెంట్రల్ లైటింగ్ లేకపోవడంతో రాత్రివేళ చిమ్మచీకటి నెలకొంటోంది. ఇటీవల రెండు ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయని స్థానికులు తెలిపారు. పగటివేళ సౌకర్యవంతంగా ఉండే ఈ మార్గం రాత్రివేళ ప్రమాదకరంగా మారుతోందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

✍️ప్రేమ్ రాజ్, తాడిగడప, కృష్ణాజిల్లా.