BREAKING
స్వతంత్ర అభ్యర్థి 48 వ వార్డు కోయిలడ సూర్య కళ ఎన్నికల ప్రచారం ఔత్సాహిక నటీనటులకు సువర్ణావకాశం.. శ్రీరామ్ 'రామభద్రుడు' సినిమా కాస్టింగ్ కాల్ వివరాలు ఇవే! గంగిపల్లిలో ఘనంగా ర్యాలీ.. మానకొండూరు AMC డైరెక్టర్‌గా ముక్కెర సతీష్ ప్రమాణస్వీకారం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు కేటాయించాలి. పెందుర్తిలో 'జన' సునామీ: జనసేన గూటికి రాజయ్యపేట ఎంపీటీసీ అభ్యర్థి ఎర్ర ఈశ్వరరావు! నీటి కుంటలో పడి ముగ్గురు మృతి.. మంచిర్యాల జిల్లాలో విషాదం ప్రశాంత ఎన్నికలే లక్ష్యం.. దువ్వాడలో పోలీసుల ఫ్లాగ్‌మార్చ్‌ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి. రేపు భూముల రీసర్వేపై గ్రామసభ మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం 49 వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తాను.. *వైసీపీ అభ్యర్థి బొడ్డేటి మాధవి కిరణ్* అభ్యర్థులు గెలిపే లక్ష్యం... -తిరునగరిలో కూటమి ప్రచార జోరు -అభివృద్ధికి పట్టం కడుతున్న కూటమికి అండగా నిలవాలి : జేబీ శ్రీనివాస్ మటన్ షాపు వద్ద వృధాగా పోతున్న త్రాగునీరు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ 51 వ వార్డు వైసిపి అభ్యర్థి సానబోయిన లలిత కుమారి ఎన్నికల ప్రచారం.. కూటమి అభ్యర్థులను గెలిపించండి

వారణాసిలో వైభవంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యోసాలు

Select Suryaa Now
వారణాసిలో వైభవంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విన్యోసాలు

సూర్య జాతీయ డెస్క్: భారతీయ వాయుసేన 94వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ లోని పవిత్ర గంగా తీరం వారణాసి వేదికగా నిర్వహించిన వింగ్స్ ఓవర్ గంగెస్ వైమానిక ప్రదర్శన అద్భుతంగా ముగిసింది. నమే ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన వైమానిక విన్యోసాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ మరియు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులు పాల్గొని దేశ రక్షణ సామర్థ్యాలను తిలకించారు.

దేశీయంగా తయారైన తేజస్ తేలికపాటి యుద్ధ విమానాలు, ప్రచండ్ లైట్ కాంబాట్ హెలికాప్టర్లు మరియు సుఖోయ్, రఫేల్ వంటి అత్య్యాధునిక ఫ్రంట్ లైన్ ఫైటర్ జెట్లు గగనతలంలో చేసిన విన్యాసాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే రవాణా మరియు సహాయక విమానాలతో పాటు సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం, సారం హెలికాప్టర్ డిస్‌ప్లే టీమ్ ప్రదర్శించిన సమన్వయ విన్యాసాలు వారణాసి గగనతలాన్ని కనువిందు చేశాయి. భారత వాయుసేన సత్తా ఏంటో చాటేలా సాగిన ఈ విన్యోసాలను వీక్షించడానికి స్థానిక ప్రజలు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు.

ఈ వైమానిక ప్రదర్శనతో పాటు వారణాసిలో అరవింద్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన దుస్తుల తయారీ పరిశ్రమను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కొత్త కేంద్రం ద్వారా ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు వందలాది మంది మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. మహిళా సాధికారతకు మరియు స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వ విధానాల పట్ల స్థానిక మహిళల నుంచి విశేష స్పందన లభించింది. వారణాసి పర్యటనలో భాగంగా ప్రధానికి ఘన స్వాగతం పలికిన మహిళలు, దేశ భద్రతా రంగంలో మరియు అభివృద్ధిలో సాధిస్తున్న విజయాలపై హర్షం వ్యక్తం చేశారు.