BREAKING
నిదుబ్రోలు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను సందర్శించిన డీఈఓ షేక్. సలీం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు షురూ! విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం పట్టభద్రుల ఓటరు నమోదుపై యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశం దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ కృషి మరువలేనిది-సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ ఇందిరాగాంధీకి కాంగ్రెస్ నేతల నివాళి పీసా చట్టంపై గ్రామసభ పొన్నూరు మండలం లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఘనంగా బుగులు వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం రోడ్డు విస్తరణ పనులకు మార్కింగ్ చేసిన అధికారులు గంజాయి సేవిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ ప్రతి ఉద్యోగికి పదవి విరమణ సహజం పాఠశాలకు ప్రింటర్ కంప్యూటర్ బహుకరించిన ఉపాధ్యాయురాలు రజిని రవితేజ 'ఇరుముడి' చిత్రానికి కొత్త చిక్కులు: మైనర్ బాలిక నటి వివాదంలో ప్రొడ్యూసర్లకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సంచలనం: మూడో వారంలోనూ దూసుకుపోతూ రూ. 442 కోట్ల మార్కును దాటిన వసూళ్లు

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం: బద్రీనాథ్ నుంచి వస్తున్న ఛాపర్ కూలి ఆరుగురు మృతి

Select Suryaa Now
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం: బద్రీనాథ్ నుంచి వస్తున్న ఛాపర్ కూలి ఆరుగురు మృతి

సూర్య నేషనల్ బ్యూరో, డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. బద్రీనాథ్ క్షేత్రం నుంచి డెహ్రాడూన్‌కు బయలుదేరిన ప్రైవేట్ హెలికాప్టర్ జోషిమఠ్ లోయ పరిసరాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఢిల్లీకి చెందిన పైలట్‌తో పాటు కర్ణాటకకు చెందిన ఐదుగురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మృతదేహాలను వెలికితీశాయి.

ట్రాన్స్ భారత్ ఏవియేషన్‌కు చెందిన ఈ హెలికాప్టర్ శుక్రవారం మధ్యాహ్నం 1:14 గంటలకు బద్రీనాథ్ నుంచి డెహ్రాడూన్‌లోని సహస్రధార హెలిప్యాడ్ వైపు బయలుదేరింది. ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతికూల వాతావరణం, దట్టమైన పొగమంచు కారణంగా 1:30 గంటల ప్రాంతంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)తో సమాచార సంబంధాలు తెగిపోయాయి. హెలికాప్టర్‌లోని ట్రాకింగ్ సిస్టమ్ కూడా నిలిచిపోయింది. అనంతరం చమోలీ జిల్లాలోని చాయ్ గ్రామం, జేపీ పవర్ హౌస్ సమీపంలోని కొండపై హెలికాప్టర్ కూలిపోయి పొగలు రావడం స్థానికులు గమనించారు.

ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికులను బెంగళూరుకు చెందిన అరుణ్ సలుంకే, హెచ్ఎస్ నటరాజ్, ప్రతాప నింగరాజన్, సుధీర్ కె, శంకర్ గౌడ వి.బిగా గుర్తించారు. వీరిలో అరుణ్ సలుంకే బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పైలట్ కెప్టెన్ హిమాన్షు సభర్వాల్ ఢిల్లీ నివాసి. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించడంతో పాటు, ముందుజాగ్రత్త చర్యగా సదరు విమానయాన సంస్థకు చెందిన అన్ని సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ (UCADA) ఆదేశించింది.