పెట్రోల్ ఎగుమతి సుంకం రద్దు..
అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతి సుంకాలను (Export Duty) సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త రకం సుంకాల సవరణలతో కూడిన కీలక ఆదేశాలను జారీ చేసింది. అక్టోబర్ 31వ తేదీ నుంచి ఈ నూతన ధరలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
ఈ సవరణల ప్రకారం.. పెట్రోల్ ఎగుమతులపై ఇప్పటివరకు విధిస్తున్న లీటరుకు రూ. 2.50 సుంకాన్ని కేంద్రం పూర్తిగా రద్దు చేస్తూ ఊరటనిచ్చింది. అదే సమయంలో డీజిల్ ఎగుమతులపై సుంకాన్ని లీటరుకు రూ. 11.50కి పెంచుతున్నట్లు వెల్లడించింది. అలాగే విమాన ఇంధనం (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ - ATF) ఎగుమతి సుంకాన్ని కూడా లీటరుకు రూ. 11కి పెంచింది. దేశీయంగా ఇంధన లభ్యతను పెంచడం, అంతర్జాతీయ ఇంధన మార్జిన్లను క్రమబద్ధీకరించడంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.