BREAKING
దేశం గర్వించదగిన జాతిరత్నం మన్మోహన్‌ సింగ్‌: సీఎం రేవంత్‌రెడ్డి హత్యరాల భక్తుల ఆనంద హేళ రోజూ అన్నం తినడం ఆరోగ్యానికి మంచిదేనా?.. నిపుణులు ఏం చెబుతున్నారు? రైతుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం 1,101 మంది నూతన ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేసిన ఒడిశా సీఎం.. అవినీతికి దూరంగా ఉండాలని మోహన్ మాఝీ హితవు జెన్-జీ ఓటు హక్కును కాలరాసి ఇప్పుడు క్యాంపుల డ్రామా.. ఈసీ తప్పుడు విధానాలపై కాంగ్రెస్ నిప్పులు ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు కోసం అడ్వైజరీ కమిటీ క్షేత్రబాట ఉదయాన్నే పచ్చి వెల్లుల్లి తింటున్నారా?.. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన ఆరోగ్య రహస్యాలు ఇవే ప్రజాస్వామ్యంపై వినాశకర దాడి.. ఎన్నికల సంఘం వివాదంపై శశి థరూర్ తీవ్ర ఆందోళన ప్రొద్దుటూరు అభివృద్ధికి కేంద్ర మంత్రులకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వినతి ప్రొద్దుటూరులో 45 రోజుల ఎగ్జిబిషన్‌కు 28న టెండర్‌-కం-బహిరంగ వేలం దాతల భక్తితో.. సీతారామాలయానికి సువర్ణ వైభవం అణు వ్యవహారంలో వెనక్కి తగ్గేదే లేదు.. అమెరికాకు ఇరాన్ ఘాటు హెచ్చరిక! నేనావత్ . పాండు లడ్డు పాట 61,000. ఆది సాయికుమార్ ఎస్‌ఐ యుగంధర్ టీజర్ విడుదల.. మాస్ యాక్షన్‌తో అదరగొట్టిన హీరో

జిమ్‌కు వెళ్తున్నారా?.వ్యాయామానికి ముందు, వెనుక తీసుకోవాల్సిన ఆహారం ముఖ్యమైన జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సిందే

Select Suryaa Now
జిమ్‌కు వెళ్తున్నారా?.వ్యాయామానికి ముందు, వెనుక తీసుకోవాల్సిన ఆహారం ముఖ్యమైన జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సిందే

సూర్య లైఫ్‌స్టైల్ డెస్క్: మంచి శరీరాకృతిని సొంతం చేసుకోవాలని, ఫిట్‌గా ఉండాలని లేదా బరువు తగ్గాలని ఆశించే చాలామంది జిమ్‌లో వ్యాయామాలు చేసేందుకు ఉత్సాహం చూపుతుంటారు. అయితే సరైన పద్ధతులు పాటించకపోవడం వల్ల కొందరు గాయాల బారిన పడుతుంటే, మరికొందరు తప్పుడు పద్ధతులతో కోరి నష్టాలను కొనితెచ్చుకుంటున్నారు. జిమ్‌లో చేరే ముందే అసలు మీ లక్ష్యం బరువు తగ్గడమా, పెరగడానికా, లేక ఫిట్‌నెస్ కోసమా అనేది స్పష్టంగా నిర్ణయించుకోవాలి. జిమ్ శిక్షకులు దాసరి చందు సూచనల ప్రకారం, వయసుకు తగినట్లుగా నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామాలు చేస్తూ, సరైన ఆహార నియమాలు మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం ఎంతో అవసరం.

వ్యాయామానికి ముందు, వెనుక తీసుకోవాల్సిన ఆహారం: జిమ్‌కి వెళ్లే సుమారు 45 నిమిషాల ముందు ఒక అరటిపండు లేదా నీటిలో నానబెట్టిన అయిదు బాదం పప్పులు తీసుకోవచ్చు. అలాగే గోరువెచ్చని నీళ్లు లేదా బ్లాక్ కాఫీ తాగడం మంచిది. ఇక వర్కవుట్స్ పూర్తయిన తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లు, ప్రొటీన్ షేక్, చికెన్, మొలకెత్తిన గింజలు లేదా ఓట్స్ ఆహారంగా తీసుకుంటే శరీరానికి తగిన శక్తి లభిస్తుంది.

వార్మప్ మరియు కూల్ డౌన్ ప్రాముఖ్యత: చాలామంది వర్కవుట్లు త్వరగా ముగించాలనే ఉద్దేశంతో వార్మప్, కూల్ డౌన్‌ను విస్మరిస్తుంటారు. వ్యాయామానికి ముందు చేసే వార్మప్ శరీ ఉష్ణోగ్రతను పెంచి కండరాలను సిద్ధం చేస్తుంది. అలాగే వర్కవుట్స్ తర్వాత చేసే కూల్ డౌన్ గుండె వేగాన్ని క్రమంగా తగ్గించి శరీరాన్ని విశ్రాంతి స్థితికి తీసుకువస్తుంది. ఈ రెండు ప్రక్రియలు గుండెపై పడే అదనపు ఒత్తిడిని సమర్థవంతంగా తగ్గిస్తాయి.

తక్కువ బరువుతో మొదలుపెట్టాలి: భారీ బరువులు ఎత్తడానికి ముందు కనీసం పది నిమిషాల పాటు శరీరాన్ని సన్నద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు 80 కిలోల బరువు ఎత్తాలనుకుంటే, ముందుగా 20, 40, 60 కిలోలతో వార్మప్ రెప్స్ చేయడం మంచిది. ఎప్పుడైనా సరే సామర్థ్యానికి మించి బరువులు ఎత్తకుండా, కొద్దికొద్దిగా బరువులు పెంచుకుంటూ వెళ్తేనే కండరాల బలం క్రమేణా పెరుగుతుంది. రోజుకి 60 నిమిషాలు వర్కవుట్లు చేస్తే సరిపోతుంది.

శిక్షకుని పర్యవేక్షణ మరియు పరికరాలపై అవగాహన: వీడియోలు చూసి లేదా ఎదుటివారిని చూసి సొంతంగా కసరత్తులు చేయడం ప్రమాదకరకం. ముఖ్యంగా కోర్, డెడ్‌లిఫ్ట్‌లు, హై ఇంటెన్సివ్, సిక్స్ ప్యాక్ లాంటి కఠిన వ్యాయామాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిపుణులైన శిక్షకుల ఆధ్వర్యంలోనే చేయాలి. అలాగే జిమ్‌లోని పరికరాలపై పూర్తి అవగాహన ఉండాలి. స్క్వాట్స్ చేసేటప్పుడు సేఫ్టీబార్‌ను ఉపయోగించడం, బెంచెస్ మరియు రాక్స్ సరిగ్గా లాక్ అయ్యాయో లేదో చూసుకోవడం తప్పనిసరి.

శ్వాస నియంత్రణ మరియు సరైన భంగిమ: రెసిస్టెన్స్ వ్యాయామాలు చేసేటప్పుడు చాలామంది శ్వాసను ఆపుతుంటారు, ఇది రక్తపోటు పెరగడానికి దారితీస్తుంది. బరువు ఎత్తుతున్నప్పుడు శ్వాస వదలాలి, దించుతున్నప్పుడు తీసుకోవాలి. అలాగే ట్రెడ్‌మిల్ మీద నడిచేటప్పుడు వాలిపోకుండా నిటారుగా ఉండటం, బరువులు ఎత్తేటప్పుడు వెన్నెముకను నిటారుగా ఉంచడం వంటి సరైన భంగిమలను పాటించడం ద్వారా గాయాలబారిన పడకుండా ఉండవచ్చు.

(గమనిక: ఆరోగ్య నిపుణుల సూచనల ఆధారంగా అందించిన ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఏదైనా కొత్త వ్యాయామ దినచర్యను ప్రారంభించే ముందు మీ వ్యక్తిగత వైద్యుల లేదా ఫిట్‌నెస్ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.)