శ్రీ భవాని రామలింగేశ్వర స్వామికి అభిషేకాలు... అట్టహాసంగా కార్తీక మాస పూజలు
వేంపల్లె మేజర్ న్యూస్:
90 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీభవాని రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. గురువారం కార్తీక మాసం సందర్భంగా అట్టహాసంగా పూజలు ప్రారంభమైనట్లు అర్చకుడు దుర్భాక వెంకట నరసయ్య వెల్లడించారు. స్వామి వారికి వేద మంత్రోచ్చారణతో పంచామృత అభిషేకం నిర్వహించారు. స్వామి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే స్వామిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రతిరోజు స్వామి వారికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా వేంపల్లెకు చెందిన పెంటంశెట్టి వంశీయులు ప్రతిరోజు అభిషేకం నిర్వహిస్తున్నారు.
రిపోర్టర్ : గండికోట షేక్ ఖదీర్
వేంపల్లె, వైఎస్ఆర్ కడప జిల్లా.