BREAKING
జురిచ్ ఇన్సూరెన్స్ సంచలన విజయం డ్రగ్స్ రవాణా అనుమానాలతో మాజీ జడ్జిపై బొలీవియా ఆడిట్ అలాస్కా ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థికి ఎదురుదెబ్బ ఏఐ బుకింగ్ ఏజెంట్ల విషయంలో వినియోగదారుల దారినే అనుసరించాలన్న మార్టిన్ సెయింట్ జార్జ్ బ్రూక్లిన్‌లో భవనం కూలి ఇద్దరు మృతి, 17 మందికి గాయాలు రేపు కళ్యాణదుర్గం లో తెలుగుదేశం పార్టీ విజయోత్సవ ర్యాలీ.. బంగ్లాదేశ్‌కు షేక్ హసీనా పునరాగమనం సాధ్యమేనా?: ప్రస్తుత రాజకీయ, న్యాయపరమైన పరిస్థితులపై విశ్లేషణ 23 మంది లబ్ధిదారులకు రూ.10.83 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య మధ్య ఆసియా సంస్కృతుల సంగమ క్షేత్రం ఉజ్బెకిస్తాన్: చరిత్ర, సంస్కృతి మరియు ఆధునిక పురోగతి దక్షిణ సూడాన్ గ్రామ ఊచకోతను నివారించడంలో యూఎన్ అధికారి విఫలం: ఆమ్నెస్టీ ఆరోపణ చిల్లేపల్లి పీఏసీఎస్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చైర్మన్‌గా కట్టా రామారావు బాధ్యతల స్వీకరణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో 12 మందితో పాలకవర్గం ఏర్పాటు శేషం తర్వాత హ్యాట్రిక్ వీరుడు సతీష్ బాబు. -- వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇజ్రాయెల్ దాడికి సిద్ధమవుతోందన్న నివేదికల వేళ ఇరాన్ తీవ్ర హెచ్చరిక యూరోపియన్ యూనియన్ కార్బన్ నిబంధనలపై ఎక్సాన్ మొబిల్ న్యాయపోరాటం

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా MSS సేవా సంస్థ ​మృతుడు గంగాధర కుటుంబానికి రూ. 2 లక్షల బీమా చెక్కు అందజేత

Select Suryaa Now
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా MSS సేవా సంస్థ  ​మృతుడు గంగాధర కుటుంబానికి రూ. 2 లక్షల బీమా చెక్కు అందజేత

​రుద్రంపేట అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకు అండగా నిలుస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న MSS సేవా సంస్థ మరోసారి తన మానవత్వాన్ని చాటుకుంది. రుద్రంపేట పంచాయతీ పరిధిలోని చంద్రబాబు నగర్‌కు చెందిన గంగాధర మూడు నెలల క్రితం మరణించగా, ఆయన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తూ రూ. 2,00,000 (రెండు లక్షల రూపాయల) బీమా మొత్తాన్ని సంస్థ ప్రతినిధులు అందించారు.

​బీమా ద్వారా ఆర్థిక భరోసా:

MSS సేవా సంస్థ ఆధ్వర్యంలో గతంలో గంగాధర పేరుపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ద్వారా ప్రమాద బీమా మరియు జీవిత బీమా చేయించారు. ఆయన మరణానంతరం సంస్థ చొరవతో మంజూరైన రూ. 2 లక్షల బీమా మొత్తం మృతుడి భార్య సుజాత బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఈ సందర్భంగా సుజాత కుటుంబ సభ్యులు సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.

​నిరంతర సేవా కార్యక్రమాలు:

రుద్రంపేట పంచాయతీ వ్యాప్తంగా సుమారు వెయ్యి పేద కుటుంబాలకు సంస్థ సొంత నిధులతో బ్యాంకు ఖాతాలు ప్రారంభించి, వారి తరపున బీమా ప్రీమియం చెల్లించి భద్రత కల్పిస్తోంది. అంతేకాకుండా, ఈ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఇతర సేవా కార్యక్రమాలు స్థానికుల మన్ననలు పొందుతున్నాయి. 

 

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్