శేషం తర్వాత హ్యాట్రిక్ వీరుడు సతీష్ బాబు. --
శేషం తర్వాత హ్యాట్రిక్ వీరుడు సతీష్ బాబు. -- ఆనాడు ఐదుసార్లు శేషం. నేడు మూడుసార్లు సతీష్ బాబు. -- మూడు చోట్ల మూడుసార్లు వరుసగా హేట్రిక్. -- రక్తసంబంధం వ్యతిరేకించింది. -- కానీ పట్టణ ప్రజలు ఆశీర్వదించారు. పెడన, సీనియర్ దివంగత నాయకుడు యర్ర శేషగిరిరావు గతంలో ఐదు సార్లు వరుసగా కౌన్సిల్ సభ్యులుగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పటినుండి ఇప్పటివరకు వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించిన వ్యక్తి సతీష్ బాబు ఈయన వరుసగా వైసిపి నుండి మూడుసార్లు కౌన్సిల్ అభ్యర్థిగా వివిధ వార్డుల నుండి పోటీ చేసి గెలుపు సాధించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి మున్సిపల్ ఎన్నికలలో విజయ దుందుభి మోగించిన, సతీష్ బాబుని మాత్రం ఓడించలేకపోయారు. పురపాలక సంఘం ఏర్పడిన నాటి నుండి 5 సార్లు శేషం గెలుపొందట ఆయన తర్వాత ఇలా మూడుసార్లు కౌన్సిలర్గా గెలిచే హ్యాట్రిక్ సాధించిన వారిలో సతీష్ బాబు ఒకడు. ఈయన గతంలో పట్టణంలో గల 1వ వార్డు, 20వ వార్డు,21 వ వార్డ్ కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఎటువంటి హ్యాట్రిక్ సాధించడంలో అప్పట్లో శేషము ఇప్పట్లో సతీష్ బాబు మాత్రమే చరిత్రలో మిగిలిపోయారు.