BREAKING
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. వందేళ్ల కలను సాకారం చేసిన ఎమ్మెల్యే అమిలినేని. పండుగ వాతావరణం లో జల హారతి. భూభారతి రీ-సర్వేపై గ్రామసభలు చిన్నారుల్లో న్యుమోనియా నివారణపై అవగాహన కార్యక్రమం నమ్మకమైన భాగస్వామి ఉంటే విజయాలు తథ్యం: సీఎం చంద్రబాబు శంషాబాద్ ఎమ్మార్వో పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం భూ రీ సర్వేకు రైతులు సహకరించాలి పత్త లేని అత్తాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి! వికలాంగుల సంఘాలకు అవకాశం కల్పించాలి ప్యూర్ ఎమోషన్స్‌తో మనసును హత్తుకునేలా ప్రియదర్శి 'ఇడుపు కాయితం' టీజర్.. డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్! ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు! వికారాబాద్‌లో కొనసాగుతున్న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి కాంగోలో ఎబోలా వ్యాప్తి అదుపులో లేదు

కౌలు రైతులకు బీమా పరిహారం అందించారు

Select Suryaa Now
కౌలు రైతులకు బీమా పరిహారం అందించారు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంకౌలు రైతులకు పంటల బీమా పరిహారం ఇవ్వలేమనడం కూటమి ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకరరావు విమర్శించారు. గురువారం మండపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఈ సందర్భంగా కామన ప్రభాకరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కౌలు రైతుల సంక్షేమం కోసం ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా విస్మరించిందని ఆరోపించారు. ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసి, ప్రీమియం భారాన్ని రైతులపై మోపడం అన్యాయమన్నారు. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో వరుస తుపానులు రైతులను మరింత కష్టాల్లోకి నెట్టాయని, పెట్టుబడులు కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కౌలు రైతుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తింపు కార్డులు, పెట్టుబడి సాయం, రుణాలు, బీమా వంటి కనీస సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని విమర్శించారు. భూమిలేని కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పి, ఆ హామీని అమలు చేయలేదన్నారు.కౌలు రైతులకు సాగుదారు హక్కు పత్రాలు జారీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, భూయజమానుల అభ్యంతరాలు, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనేకమంది కౌలు రైతులుగుర్తింపు కార్డులు పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. గుర్తింపు కార్డులు ఇవ్వకుండా, బీమా పథకంలో నమోదు చేసుకోలేదని కౌలు రైతులనే నిందించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

గత ప్రభుత్వం ఐదేళ్లపాటు రైతులపై ప్రీమియం భారం పడకుండా ఉచిత పంటల బీమా అమలు చేసిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసి స్వచ్ఛంద నమోదు విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. ప్రభుత్వ ప్రీమియం వాటా చెల్లింపులో జాప్యం కారణంగా 2023-24 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి సుమారు రూ.1,385 కోట్ల బీమా పరిహారం రైతులకు అందకుండా పోయిందని ఆరోపించారు. రబీ 2024, ఖరీఫ్ 2025 సీజన్లలోనూ బీమా ప్రయోజనాలు రైతులకు అందలేదని, ఈ అంశాలపై ప్రభుత్వం వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.అర్నబ్, మురసు తుపానుల ప్రభావంతో అధికారిక ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 12.50 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఇందులో 11.40 లక్షల ఎకరాల్లో వరి పంట తీవ్రంగా నష్టపోయిందని తెలిపారు. తమ సంఘం ప్రాథమిక సర్వే ప్రకారం పంట నష్టపోయిన విస్తీర్ణం 15 లక్షల ఎకరాలకు పైగా ఉంటుందని పేర్కొన్నారు. బాధిత రైతులకు తక్షణమే ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం అందించాలని కోరారు.