వికలాంగుల సంఘాలకు అవకాశం కల్పించాలి
సూర్య బెజ్జుర్:కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: బెజ్జూర్, కౌటాల, చింతలమానేపల్లి, పెంచికల్‌పేట్, దహెగాం, సిర్పూర్, కాగజ్‌నగర్ ఏడు మండలాల్లో వికలాంగుల స్వయం సహాయక సంఘాల ఏర్పాటుకు అవకాశం కల్పించాలని వికలాంగులు కోరుతున్నారు. గతంలో కొనసాగిన పొదుపు సంఘాలు ప్రస్తుతం ఎందుకు లేవని ప్రశ్నిస్తున్నారు. మహిళా సంఘాల తరహాలో వికలాంగులకు కూడా గ్రూపులు ఏర్పాటు చేసి పొదుపు, రుణ సదుపాయాలు కల్పించాలని, ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నా ఏపీఎం అధికారులు ఎందుకు అవకాశం కల్పించడం లేదో స్పష్టం చేయాలనిజిల్లా కాంగ్రెస్ వికలాంగుల అధ్యక్షులు రవి శంకర్ డిమాండ్ చేశారు..