BREAKING
అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయండి _ నవంబర్ 15 నల్లగొండలో జాతీయ మహాసభలు ఓటీటీలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇదే సుడిగాలి సుధీర్ ‘గోట్’ మూవీ రివ్యూ: టెలివిజన్ స్టార్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా సోషల్ మీడియా ట్రోలింగ్‌పై బాబిల్ ఖాన్ స్పందన: తాను భావోద్వేగపరుడినే కానీ బలహీనుడిని కాదంటూ నటుడి ఘాటు వ్యాఖ్యలు సల్మాన్ ఖాన్ తల్లిదండ్రుల అరుదైన ఫోటో వైరల్: వారి కొడుకుగా పుట్టడం అదృష్టమంటూ సోహైల్ ఖాన్ భావోద్వేగం అయ్యప్ప స్వామి దేవస్థాన అభివృద్ధికి రూ.7 లక్షల విరాళం చిన్న విషయాలపై విమర్శలు సరికాదు: ‘రామాయణ’లో కైకేయి లుక్‌పై లారా దత్తా ఆసక్తికర వ్యాఖ్యలు నసనకోట గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంఈఓ నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘టేకెన్’: నట్లీ హోలోవే మిస్సింగ్ కేసు వెనుక అసలు నిజాలు ఇవే పది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం దారుణం గరుడేశ్వర్ ప్రత్యేక పూజలు శబరిమలై పాదయాత్ర బృందానికి మాజీ మంత్రి విడదల రజని ఆత్మీయ పలకరింపు ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ హైమావతి. రెండు సంవత్సరాల సంకోచం తర్వాత మైక్రో డ్రామాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నైరా బెనర్జీ బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ తగ్గుముఖం: ఇంకా రెండు వందల కోట్ల మార్కును దాటని చిత్రం

కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి

Select Suryaa Now
కోర్టుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేడు నాంపల్లిలోని ప్రత్యేక ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. 2021లో జరిగిన నాగార్జునసాగర్ శాసనసభ ఉప ఎన్నికల ప్రచార సమయంలో కరోనా నిబంధనలను ఉల్లంఘించారన్న అభియోగంపై ఆయనపై అప్పట్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు.

అప్పట్లో కోవిడ్-19 ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ అనుమతి లేకుండా పెద్ద ఎత్తున జనసమీకరణ చేసి ప్రచారం నిర్వహించారని పేర్కొంటూ పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. కాగా, ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో నాంపల్లి కోర్టు ప్రాంగణం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కోర్టు పరిసరాల్లో సాధారణ రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విచారణ అనంతరం న్యాయస్థానం తదుపరి వాయిదాను ఖరారు చేసింది.