రామచంద్రాపురం సదర్ వేడుకలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన రమేష్ యాదవ్.
రామచంద్రాపురం: రామచంద్రాపురంలో యాదవుల ఐక్యత, ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే సదర్ వేడుకలను రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత కొన్నేళ్లుగా సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ యాదవుల సంప్రదాయాలు, సంస్కృతికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తున్నారు. ఆయన పర్యవేక్షణలో సండే మార్కెట్ ప్రాంగణం సదర్ సంబరాలతో సందడిగా మారింది. ప్రత్యేకంగా అలంకరించిన దున్నపోతులు, వాటి విన్యాసాలు, ప్రదర్శనలు వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దున్నపోతుల అందమైన అలంకరణలు, వాటి విన్యాసాలను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ.. రామచంద్రాపురంలో గత కొన్నేళ్లుగా సదర్ వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహిస్తూ యాదవుల ఐక్యతను చాటిచెబుతున్నామని తెలిపారు. సదర్ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, యాదవుల సంస్కృతి, సంప్రదాయం, వీరత్వం, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంతో పాటు యాదవులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతో రాబోయే రోజుల్లోనూ మరింత ఘనంగా సదర్ వేడుకలను నిర్వహిస్తామని తెలిపారు. రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు రామచంద్రాపురంలో ప్రత్యేక సందడి నెలకొల్పాయి.