BREAKING
అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయండి _ నవంబర్ 15 నల్లగొండలో జాతీయ మహాసభలు ఓటీటీలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇదే సుడిగాలి సుధీర్ ‘గోట్’ మూవీ రివ్యూ: టెలివిజన్ స్టార్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా సోషల్ మీడియా ట్రోలింగ్‌పై బాబిల్ ఖాన్ స్పందన: తాను భావోద్వేగపరుడినే కానీ బలహీనుడిని కాదంటూ నటుడి ఘాటు వ్యాఖ్యలు సల్మాన్ ఖాన్ తల్లిదండ్రుల అరుదైన ఫోటో వైరల్: వారి కొడుకుగా పుట్టడం అదృష్టమంటూ సోహైల్ ఖాన్ భావోద్వేగం అయ్యప్ప స్వామి దేవస్థాన అభివృద్ధికి రూ.7 లక్షల విరాళం చిన్న విషయాలపై విమర్శలు సరికాదు: ‘రామాయణ’లో కైకేయి లుక్‌పై లారా దత్తా ఆసక్తికర వ్యాఖ్యలు నసనకోట గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంఈఓ నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘టేకెన్’: నట్లీ హోలోవే మిస్సింగ్ కేసు వెనుక అసలు నిజాలు ఇవే పది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం దారుణం గరుడేశ్వర్ ప్రత్యేక పూజలు శబరిమలై పాదయాత్ర బృందానికి మాజీ మంత్రి విడదల రజని ఆత్మీయ పలకరింపు ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ హైమావతి. రెండు సంవత్సరాల సంకోచం తర్వాత మైక్రో డ్రామాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నైరా బెనర్జీ బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ తగ్గుముఖం: ఇంకా రెండు వందల కోట్ల మార్కును దాటని చిత్రం

ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Select Suryaa Now
ప్రభుత్వ ఆసుపత్రి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

సూర్య, కాగజ్‌నగర్:ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, భద్రతా సిబ్బంది న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ కొమురం భీం  జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కాగజ్‌నగర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఉపేందర్ మాట్లాడుతూ.. 10 నుంచి 20 ఏళ్లుగా సేవలందిస్తున్న కార్మికులకు నాలుగేళ్లుగా వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్ కార్మికులకు నెలకు రూ.26 వేల వేతనం చెల్లించాలని, చట్ట ప్రకారం వేతనాలు, సెలవులు, బోనస్, రెండు జతల యూనిఫాంలు అందించాలని డిమాండ్ చేశారు. ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లించడంతో పాటు పూర్తి వేతనంపై ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరారు.ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే నవంబర్ 28 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తిరుమల, మీనాక్షి, ఇమ్రాన్ తదితర కార్మికులు పాల్గొన్నారు.