ఏటీఎంలో చోరీకి పాల్పడిన నిందితుడిఅరెస్ట్ - కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ
సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 11న జరిగిన ఏటీఎం ధ్వంసం చేసి దొంగతనాన్ని పాల్పడిన అర్ధరాత్రి వేళ ఏటీఎం యంత్రాన్ని పగలగొట్టి నగదు దోచుకునేందుకు ప్రయత్నించిన ఓ నిందితుడిని కామారెడ్డి పట్టణ పోలీసులు కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే చాకచక్యంగా పట్టుకున్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కామారెడ్డి పట్టణంలోని జేపీఎన్ రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలోకి గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ముందుగా ఏటీఎం కేంద్రంలోని సీసీ కెమెరాలను తొలగించాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో ఏటీఎం యంత్రాన్ని ధ్వంసం చేసి నగదు దొంగిలించేందుకు యత్నించాడు. ఆ సమయంలో ఏటీఎం భద్రతా విభాగం నుండి ఒక్కసారిగా అలారం (సైరన్) మోగడంతో భయపడిపోయి డబ్బు తీసుకోకుండానే అక్కడి నుంచి పరారయ్యాడు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు.ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో, డీఎస్పీ ఎస్. మధుసూదన్ పర్యవేక్షణలో టౌన్ ఎస్‌హెచ్‌ఓ నరహరి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు, పట్టణంలోని వాల్మీకి బ్యాండ్ షాపులో పనిచేస్తున్న మహారాష్ట్రలోని పర్భణి జిల్లాకు చెందిన మహేష్ జ్ఞానోబా బిందే (33) ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. అప్పు తీర్చడానికే దొంగతనం చోరీ యత్నం కు పాల్పడ్డట్లు, తర్వాత పోలీసులకు అనుమానం రాకుండా పట్టణంలోనే తలదాచుకున్న నిందితుడు, తన స్వగ్రామానికి పారిపోయేందుకు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగా పోలీసులు వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా తాను ఒకరి వద్ద తీసుకున్న రూ.10 వేల అప్పు తీర్చేందుకే ఏటీఎం చోరీకి పథకం వేసినట్లు నిందితుడు అంగీకరించాడు. నిందితుడి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన ఇనుప రాడ్డు, ఏటీఎం నుండి ఎత్తుకెళ్లిన సీసీ కెమెరాలు, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్పీ తెలిపారు. పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి, సాంకేతిక ఆధారాల సాయంతో గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుల్ నర్సింలు, హోంగార్డు మోహన్ రెడ్డిలను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ మస్తు ధన్రావు కామారెడ్డి పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి ఇతర పోలీస్ సిబ్బంది ఇతర పోలీసులు తదితరులు పాల్గొన్నారు.