లయన్ డాక్టర్ రేకులపల్లి విజయ కు మాతృసవనం సన్మానం చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా అవార్డు, సన్మానం
సూర్య, సుల్తానాబాద్
శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి 70వ తిరునక్షత్ర మహోత్సవాల యతీంద్ర సప్తతి సందర్భంగా సమాజ సేవలో విశేష కృషి చేసిన వివిధ రంగాలకు చెందిన మహిళ ప్రతిభావంతులకు గౌరవాన్ని అందించారు. అందులో భాగంగా బుధవారం హైదరాబాదులో ముచ్చింతలోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ లో జరిగిన కార్యక్రమంలో భాగంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి మాతృ సవనం అవార్డును శ్రీవాణి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లయన్ రేకులపల్లి విజయ కు అందించి సన్మానించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక, డైరెక్టర్ రేకులపల్లి సుష్మ ప్రిన్సిపల్స్ బండారి కమలాకర్ బాలసాని శ్రీనివాస్ అధ్యాపక బృందం విజయ కు అవార్డు రావడం మన ప్రాంతానికి శ్రీవాణి విద్యాసంస్థలకు దక్కిన గౌరవమనీ సంతోషం వ్యక్తం చేశారు.