BREAKING
భారత్-న్యూజిలాండ్ నాలుగో వన్డే: తుదిజట్టు కూర్పుపై ఆకాష్ చోప్రా ఆసక్తికర జోస్యం అఖిల భారత కిసాన్ సభను జయప్రదం చేయండి _ నవంబర్ 15 నల్లగొండలో జాతీయ మహాసభలు ఓటీటీలో అగ్రస్థానంలో దూసుకుపోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇదే సుడిగాలి సుధీర్ ‘గోట్’ మూవీ రివ్యూ: టెలివిజన్ స్టార్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా సోషల్ మీడియా ట్రోలింగ్‌పై బాబిల్ ఖాన్ స్పందన: తాను భావోద్వేగపరుడినే కానీ బలహీనుడిని కాదంటూ నటుడి ఘాటు వ్యాఖ్యలు సల్మాన్ ఖాన్ తల్లిదండ్రుల అరుదైన ఫోటో వైరల్: వారి కొడుకుగా పుట్టడం అదృష్టమంటూ సోహైల్ ఖాన్ భావోద్వేగం అయ్యప్ప స్వామి దేవస్థాన అభివృద్ధికి రూ.7 లక్షల విరాళం చిన్న విషయాలపై విమర్శలు సరికాదు: ‘రామాయణ’లో కైకేయి లుక్‌పై లారా దత్తా ఆసక్తికర వ్యాఖ్యలు నసనకోట గురుకుల పాఠశాలలో మధ్యాహ్న భోజనం తనిఖీ చేసిన ఎంఈఓ నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘టేకెన్’: నట్లీ హోలోవే మిస్సింగ్ కేసు వెనుక అసలు నిజాలు ఇవే పది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం దారుణం గరుడేశ్వర్ ప్రత్యేక పూజలు శబరిమలై పాదయాత్ర బృందానికి మాజీ మంత్రి విడదల రజని ఆత్మీయ పలకరింపు ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ హైమావతి. రెండు సంవత్సరాల సంకోచం తర్వాత మైక్రో డ్రామాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నైరా బెనర్జీ

భూ రీసర్వేలో తప్పులకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ దీపక్ తివారీ

Select Suryaa Now
భూ రీసర్వేలో తప్పులకు తావులేకుండా పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్ దీపక్ తివారీ

మర్పల్లి, మేజర్ న్యూస్ (నవంబర్ 12): భూ రీసర్వే పనులను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. గురువారం మర్పల్లి మండలంలోని వీర్లపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన భూ రీసర్వే పనులు, విబిజి రామ్ జీ పనులు, పాఠశాలల్లో సౌకర్యాలు, చేయూత పెన్షన్ల ధృవీకరణ, భూభారతి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రైతుకు సంబంధించిన భూములను క్షేత్రస్థాయిలో ఖచ్చితంగా గుర్తించి హద్దులను నిర్ధారించాలని, భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సర్వే నిర్వహణకు కనీసం 24 గంటల ముందుగా పట్టాదారులకు నోటీసులు అందించాలని, సర్వే అనంతరం భూమి విస్తీర్ణం వివరాలను రైతులకు తెలియజేయాలని ఆదేశించారు.గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మహిళా సమాఖ్య భవనంతో పాటు ప్రాథమిక పాఠశాలను సందర్శించిన కలెక్టర్, పాఠశాలకు విబిజి రామ్ జీ కింద ప్రహరీ గోడ నిర్మించాలని డీఆర్డీవోను ఆదేశించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చిన్నచిన్న మరమ్మతులు చేపట్టాలని సర్పంచ్‌కు సూచించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి పెండింగ్ దరఖాస్తులపై అధికారులతో సమీక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని, పెన్షన్ల ఎంపికలో పొరపాట్లకు తావులేకుండా చూడాలని ఎంపీడీవోకు సూచించారు. మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించాలని, ఇళ్లు మంజూరైనా నిర్మాణాలు ప్రారంభించని వాటిని నిబంధనల ప్రకారం రద్దు చేయాలని తెలిపారు. భూభారతి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఈ పర్యటనలో డీఆర్డీవో శ్రీనివాస్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ మధుసూదన్, ఎంఈఓ అశోక్, తహసీల్దార్ మనోహర్ చక్రవర్తి, ఎంపీడీవో శాంత, సర్పంచ్ చుక్కా రెడ్డి, ఉప సర్పంచ్ దివ్య, సర్వేయర్లు, రైతులు పాల్గొన్నారు.