BREAKING
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. వందేళ్ల కలను సాకారం చేసిన ఎమ్మెల్యే అమిలినేని. పండుగ వాతావరణం లో జల హారతి. భూభారతి రీ-సర్వేపై గ్రామసభలు చిన్నారుల్లో న్యుమోనియా నివారణపై అవగాహన కార్యక్రమం నమ్మకమైన భాగస్వామి ఉంటే విజయాలు తథ్యం: సీఎం చంద్రబాబు శంషాబాద్ ఎమ్మార్వో పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం భూ రీ సర్వేకు రైతులు సహకరించాలి పత్త లేని అత్తాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి! వికలాంగుల సంఘాలకు అవకాశం కల్పించాలి ప్యూర్ ఎమోషన్స్‌తో మనసును హత్తుకునేలా ప్రియదర్శి 'ఇడుపు కాయితం' టీజర్.. డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్! ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు! వికారాబాద్‌లో కొనసాగుతున్న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి కాంగోలో ఎబోలా వ్యాప్తి అదుపులో లేదు

గాజులదిన్నె ప్రాజెక్టు, సుంకేసుల జలాశయాల నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలి*

Select Suryaa Now
గాజులదిన్నె ప్రాజెక్టు, సుంకేసుల జలాశయాల నీటిని  తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలి*

 

 

కర్నూలు, నవంబర్ 12:- గాజులదిన్నె ప్రాజెక్టు, సుంకేసుల జలాశయాల్లో  ఉన్న నీటిని కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని, సాగునీటి అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించుకోవడానికి వీలులేదని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం రెవెన్యూ అంశాల పై కలెక్టర్ సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు..

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జలాశయాల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా తాగునీరు మినహా ఇతర అవసరాలకు, ముఖ్యంగా సాగునీటి అవసరాలకు నీటిని వినియోగిస్తున్నట్లు గుర్తిస్తే వారిపై  చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ విషయంపై గ్రామస్థాయిలో దండోరా వేయించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, ప్రతి గ్రామంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ  అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ ఆర్డీవోలను ఆదేశించారు.

జిల్లాలో సుమారు 2,400 మంది బీఎల్ఓలు ఉన్న నేపథ్యంలో ఒక్కో బీఎల్ఓకు సగటున 3 నుంచి 4 ఫారాల పరిశీలన మాత్రమే ఉంటుందని, ఎన్నికలకు సంబంధించిన పెండింగ్ ఫారాల పరిశీలన, డిస్పాచ్ ప్రక్రియను నవంబర్ 20వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నవంబర్ 13వ తేదీ వరకు అందే ఫారాలను వెంటనే పరిశీలించి, వారంలోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.. ఎన్నికలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బుక్-ఏ కాల్ కేసులను కూడా తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

వార్తాపత్రికల్లో బియ్యం పంపిణీపై వస్తున్న కథనాలను తీవ్రంగా పరిగణించి సంబంధిత ప్రాంతాల్లో వెంటనే తనిఖీలు నిర్వహించాలన్నారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు రైస్ కౌంటర్లను తనిఖీ చేసి, అన్ని మండలాల నుంచి వారం రోజుల్లో సమగ్ర నివేదికలు సమర్పించాలన్నారు. ఈ విషయంలో ఆర్డీఓలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని  కలెక్టర్ స్పష్టం చేశారు.

22ఏ భూములకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 290 దరఖాస్తులను నవంబర్ 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో పరిష్కరించి, తదుపరి వీడియో కాన్ఫరెన్స్ నాటికి దరఖాస్తులు ఏవి కూడా పెండింగ్ లో ఉండకూడదన్నారు..

రీసర్వే ఫేజ్-3, ఫేజ్-4లో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని, ఫేజ్-6లోని 44 గ్రామాల్లో రోజువారీ సర్వే లక్ష్యాన్ని పెంచాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రోజుకు సుమారు 3,400 సర్వేలు జరుగుతున్న నేపథ్యంలో నిర్దేశించిన 4,000 సర్వేల లక్ష్యాన్ని సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం కోరిన వివరాలతో కూడిన నివేదికను నిర్దేశిత ప్రొఫార్మాలో సిద్ధం చేసి సమర్పించాలన్నారు.. జిల్లాలో మొత్తం అర్హుల సంఖ్య, లేఅవుట్లలో స్థలాలు పొందిన లబ్ధిదారుల వివరాలు, ఇంకా స్థలాలు కేటాయించాల్సిన వారి సంఖ్య, అవసరమైన భూమి, అంచనా వ్యయం తదితర అంశాలను నివేదికలో పొందుపరచాలన్నారు..
 

జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్. మండలాల వారీగా రెవెన్యూ అంశాలపై క్షుణ్ణంగా సమీక్షించారు.

టెలి కాన్ఫరెన్స్ లో డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, ఆదోని ఆర్డీఓ అరుణ దేవి, తహసిల్దార్ లు తదితరులు పాల్గొన్నారు.